వచ్చే ఏడాది సెలవులు ఇవే - ప్రకటించిన ప్రభుత్వం : ఆదివారం ఆరు పండుగలు..!!
ప్రతీ ఏటా ఉద్యోగులు..సాధారణ ప్రజానీకానికి ముందస్తు సమాచారం కోసం ప్రభుత్వం పండుగులు..సెలవుల వివరాలను వెల్లడిస్తోంది. ఇది చాలా కాలంగా కొనసాగుతోంది. ఇక, మరో నెల రోజుల్లో కొత్త సంవత్సరం 2022 ప్రారంభం కానుంది. రాబోయే ఏడాదికి గానూ పండుగలు, సెలవుల తేదీలను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. 2022 సంవత్సరంలో పండుగలు, ఇతర సెలవుల జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
వచ్చే ఏడాది 28 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులను గుర్తించి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం 23 రోజులు సాధారణ సెలవులుగా ప్రకటించారు. ముఖ్యమైన సెలవులు జనవరి 1 నూతన సంవత్సరం, 15 సంక్రాంతి, 26 గణతంత్రదినోత్సవం, మార్చి 1 మహాశివరాత్రి, 18 హోళీ, ఏప్రిల్ 2 ఉగాది, 10 శ్రీరామనవమి, 14 అంబేడ్కర్ జయంతి, 15 గుడ్‌ఫ్రైడే, మే 3, 4 రంజాన్, ఆగస్టు 15 స్వాతంత్య్రదినోత్సవం, సెప్టెంబరు 25 బతుకమ్మ ప్రారంభరోజు, అక్టోబరు 5 విజయదశమి, 9 మిలాద్-ఉన్-నబి, 25 దీపావళి, డిసెంబరు 25 క్రిస్‌మ్‌సగా పేర్కొన్నారు.

కాగా, వారాంతపు సెలవు దినం అయిన ఆదివారం నాడు ఆరు సెలవు దినాలు వచ్చాయి. దాదాపుగా ఇదే సెలవులు జాతీయ బ్యాంకులకు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం కొద్ది పాటు మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో మేరకు ఉద్యోగులు వచ్చే ఏడాది 28 క్యాజువల్ సెలవులు, 23 ఆప్షనల్ సెలవులుగా ప్రకటించారు. తెలంగాణలో సెప్టెంబర్ 25న బతుకమ్మ ప్రారంభం అవుతుండగా..అదే రోజు నుంచి ఏపీలో దసరా నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఇక, మిగిలిన పండుగల్లో రెండు రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా సెలవులు ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications