నేను ఢమ్మీగా ఉండను, నా పని నేను చేస్తా

పుదుచ్చేరి ప్రభుత్వం తనను ఢమ్మీగా చూడాలనుకొంటుందని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చెప్పారు. వచ్చే ఏడాది మే 29వ, తేదిన తాను పదవి నుండి తప్పుకొంటానని ఆమె మరోసారి పునరుద్ఘాటించారు.

హైదరాబాద్ :పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తనకున్న విబేధాలపై స్పందించారు. ప్రభుత్వం తనను డమ్మీగా ఉండాలని భావిస్తోందని చెప్పారు. అయితే తన బాద్యతలను, విధులను సక్రమంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ మద్య విబేధాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాలు చెల్లవంటూ కిరణ్ బేడీ ఇటీవలే చేసిన ఆదేశాలు ఇద్దరి మద్య కొనసాగుతున్న విబేధాలకు అద్దం పట్టాయి.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తీరుపై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడ ఫిర్యాదుచేశారు.

ఇదిలా ఉంటే లెఫ్టినెంట్ గవర్నర్ గా రెండేళ్ళ పాటు పదవిని పూర్తి చేసుకొన్న తర్వాత ఆ బాద్యతల నుండి తప్పుకొంటానని కిరణ్ బేడీ ప్రకటించారు. కిరణ్ బేడీ వ్యవహరశైలి ముఖ్యమంత్రికి నచ్చడం లేదు. ఈ పరిణామాలను దృస్టిలో ఉంచుకొని కాంగ్రెస్ నాయులు ఆమెపై రాజ్ నాథ్ కు ఫిర్యాదు చేశారు.

నన్ను డమ్మీగా చూడాలనుకొంటున్నారు.

నన్ను డమ్మీగా చూడాలనుకొంటున్నారు.

పుదుచ్చేరి ప్రభుత్వం తనను ఢమ్మీగా చూడాలని భావిస్తోందని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడాన్ని ముఖ్యమంత్రి తప్పుబట్టారని ఆమె గుర్తుచేస్తున్నారు.అయితే వాట్సాప్ గ్రూప్ లో అధికారిక కార్య్కమాలను కొనసాగించడం చెల్లదని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సిఎం ఆదేశాలే చెల్లవని ఆమె తేల్చిచెప్పారు.ఢమ్మీ లెప్టినెంట్ గవర్నర్ గా తనను చూడాలని తమ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.

రెండేళ్ళ పదవికాలం పూర్తిచేసి వైదొలుగుతా

రెండేళ్ళ పదవికాలం పూర్తిచేసి వైదొలుగుతా

వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కిచెందిన ఎంఏల్ఏలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కిరణ్ బేడీపై ఫిర్యాదుచేశార.అదే రోజున ఆమె తన పదవీ విరమణపై ప్రకటన చేశారు. యాధృచ్ఛికమే అయినా ఈ ఘటన కొంత సంచలనం కల్గించింది. వచ్చే ఏడాది మే 29వ, తేదిన తన పదవికి గుడ్ బై చెప్పనున్నట్టు కిరణ్ బేడీ మరో సారి స్పష్టం చేశారు. హైద్రాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమె మరోసారి ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు.రెండేళ్ళపాటు పదవిలోనే కొనసాగాలని భావించానని, పదవి చేపట్టకముందే ఈ నిర్ణయం తీసుకొన్నానని ఆమె చెప్పారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పుదుచ్చేరి

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పుదుచ్చేరి

పుదుచ్చేరి ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కిరణ్ బేడీ అభిప్రాయపడ్డారు అప్పుల ఊబి నుండి రాష్ట్రాన్ని బయటపడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడడం కోసమే తాను ప్రయత్నిస్తానని చెప్పారు. దరిమిలా తనను అపార్థం చేసుకొంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

అవినీతి నిర్మూలనకు కార్యక్రమాలు

అవినీతి నిర్మూలనకు కార్యక్రమాలు

అవినీతి నిర్మూలన కోసం పుదుచ్చేరి రాష్ట్రంలో కిరణ్ బేడీ చేపట్టిన కార్యక్రమాలు పలు వురి ప్రశంసలు పొందాయి. స్వచ్చ పుదుచ్చేరి లక్ష్యంగా తాను చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కిరణ్ బేడీ అభిప్రాయపడ్డారు. నేరాలను నియంత్రించేందుకు ఆమె చేసిన కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+