వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మక్కలను కొనుగోలు చేస్తాం, పత్తికి కూడా మద్దతు ధర, అందుకు కారణం కేంద్రమే: హరీశ్ రావు

|
Google Oneindia TeluguNews

మక్క పంట కొనుగోలు ఆలస్యానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్ర నిర్ణయం వల్ల పంట కొనుగోలు ఆలస్యమయ్యిందని చెప్పారు. కేంద్రం విధాన నిర్ణయం రావడం ఆలస్యమయ్యిందని తెలిపారు. చివరికీ మక్క పంట కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పంటల కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో మెలగుతుందని చెప్పారు.

మక్క పంట వేసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. వారిని ఇబ్బందులకు గురిచేయొద్దని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మక్క పంటను కొనుగోలు చేయాలని డిసిషన్ తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడే కాదు గత సంవత్సరం కొనుగోలు చేసిన మక్కలు కూడా ఇప్పటికీ అలానే ఉన్నాయని చెప్పారు. గోడౌన్లలో మగ్గుతున్నాయని చెప్పారు. అందుకే ఈ సారి కొనుగోలు నిర్ణయం వెల్లడించడానికి ఆలస్యమయ్యిందని చెప్పారు.

government will buy Corn crop: minister harish rao

మక్కలతోపాటు పత్తిని కూడా కొనుగోలు చేస్తామని తెలిపారు. 30 కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేస్తామని హరీశ్ రావు వెల్లడించారు. రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 8 శాతం తేమ ఉన్నా పత్తికి రూ.5 వేల 775 మద్దతు ధర ఇస్తామని హరీశ్ రావు తెలిపారు. వరి రూ.1888 ఇస్తామని తెలిపారు. మ్యాచర్ చూసి.. వచ్చాకే కొనుగోలు చేస్తామన్నారు. అయితే కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపంగా మారాయని హరీశ్ రావు పేర్కొన్నారు.

English summary
telangana government will buy Corn crop finance minister harish rao said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X