Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూధనాచారి- కౌశిక్ రెడ్డి స్థానంలో ప్రతిపాదన : గవర్నర్ ఆమోదం..!!

ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీలను ప్రకటించిన టీఆర్ఎస్ తాజాగా.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని ఖరారు చేసారు. కొంత కాలంగా ఎమ్మెల్సీ రేసులో ప్రచారంలో ఉన్న మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది తెలంగాణ రాష్ట్ర కేబినేట్‌. తెలంగాణ రాష్ట్ర మంత్రుల సంతకాలతో కూడిన ఫైల్ ను రాజ్ భవన్ కు పంపింది. కొద్ది నెలల క్రితం హుజూరాబాద్ కాంగ్రెస్ నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.

కౌశిక్ రెడ్డి పేరుకు లభించని ఆమోదం

కౌశిక్ రెడ్డి పేరుకు లభించని ఆమోదం

ఆ తరువాత తెలంగాణ కేబినెట్ కౌశిక్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లినా ఆమోదం మాత్రం లభించలేదు. దాదాపుగా మూడు నెలల కాలంగా ఆ ఫైల్ పెండింగ్ లో ఉంది. కౌశిక్ పైన ఉన్న కేసుల పైన వివరాలను సేకరించినట్లుగా చెబుతున్నారు. దీంతో..తాజాగా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు. ఆయన నామినేషన్ సైతం దాఖలు చేసారు. దీంతో..ఇప్పుడు పార్టీ ఏర్పాటు నుంచి పార్టీలో కొనసాగుతున్న..ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉండే మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఖరారు చేసారు.

మండలి ఛైర్మన రేసులో ఇద్దరు

మండలి ఛైర్మన రేసులో ఇద్దరు

ఈ మేరకు మంత్రుల నుంచి సంతకాలు సైతం పూర్తి చేసి గవర్నర్ కు పంపటం తో ..గవర్నర్ సైతం మధుసూధనాచారి విషయంలో వెంటనే ఆమోద ముద్ర వేసారు. 2014 నుంచి మధుసూధనాచారి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా పని చేసారు. దీంతో..ఇప్పుడు మండలి ఛైర్మన్ గా మధుసూదనా చారి కి అవకాశం ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే 2018లో మరోసారి భూపాలపల్లి నుంచి బరిలో నిలిచిన మధుసూదనాచారి.. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా ఉంటూ వస్తున్న మధుసూదనాచారిని రాజ్యసభకు పంపుతారనే ప్రచారమూ సాగింది.

మధుసూదనా చారి ఎంపికతో

మధుసూదనా చారి ఎంపికతో

అయితే, అనూహ్యంగా ఆయన పేరును ఎమ్మెల్యే కోటాలా కాకుండా గవర్నర్ కోటాలో మండలికి ఎంపిక చేసారు. ఇక, ఇదే సమయంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ సైతం ఉంటుందనే ప్రచారం మొదలైంది. ఈ సారి ఎమ్మెల్సీల్లో వరంగల్ జిల్లాకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో..ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఎవరనేది ఆసక్తి కరంగా మారింది. దీని పైన కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నామినేషన్లకు సంబంధించి సమయం ఉండటంతో..ఈ నెల 22న పేర్లు ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పలువురు ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+