పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం..!!

తెలంగాణ ప్రభుత్వ పెండింగ్ బిల్లుల వ్యవహారంలో గవర్నర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవటం న్యాయ పరమైన వివాదంగా మారింది. దీని పైన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం పంపిన బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవటం పాలనా పరంగా ఇబ్బందిగా మారుతోందని ప్రభుత్వం పిటీషన్ లో పేర్కొంది. ఇప్పుడు ఈ బిల్లుల పైన గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ పైన దాఖలు చేసిన పిటీషన్ ఈ రోజున సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికి ముందే గవర్నర్ తన నిర్ణయం ప్రకటించారు. గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా కాల యాపన చేస్తున్నాంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొంది. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం పంపిన డీఎంఈ వయో పరిమితి బిల్లును గవర్నర్ తిరస్కరించారు. మరో రెండు బిల్లుల పైన రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు. మున్సిపల్ నింబంధనలు, ప్రైవేటు వర్సిటీల బిల్లుపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి పంపారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఎలాంటి పెడింగ్ బిల్లులు లేదని రాజ్ భవన్ వర్గాలు స్పష్టం చేసాయి.

Tamilisai Soundararajan took key decision on Pending bills

ప్రభుత్వం మొత్తం పది బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపింది. అందులో..మొత్తం 10 బిల్లులకు గాను 3 ఆమోదించగా,2 రాష్ట్రపతి పరిశీలనకు, మరో రెండు వెనక్కి పంపారని, మూడు పెండింగ్ లో ఉన్నట్లుగా వెల్లడించారు. ఇప్పటి అందులో రెండు బిల్లులపై వివరణ కోరుతూ, మరో బిల్లు తిరస్కరిస్తూ గవర్నర్ నిర్ణక్ష్ం తీసుకున్నారు. గవర్నర్ వివరణ కోరిన రెండు బిల్లులను ప్రభుత్వం తిరిగి యదాతదంగా పంపుతుందా, లేక సవరణ చేసి పంపుతుందా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. గవర్నర్ కోరిన వివరణ ఆధారంగా నిర్ణయం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు బిల్లుల వ్యవహారం ముగిసినట్లుగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+