Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నన్ను కట్టడి చేయలేరు, కేసీఆర్ ను చూసి నేర్చుకున్నా - గవర్నర్ తమిళసై..!!

తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రోటోకాల్..సవాళ్లు తనను అడ్డుకోలేవని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు. జమిలి ఎన్నికలను తాను సమర్ధిస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ పైన ప్రశంసలు కురిపించారు. వైద్య రంగంలో ప్రభుత్వం బాగా పని చేస్తోందన్నారు. బిల్లులను తిరిగి పంపటంలో ఎలాంటి రాజకీయం లేదని గవర్నర్ స్పష్టం చేసారు.

గవర్నర్ గా తమిళసై నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు.ఈ సందర్బంగా తాను రాసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని విడుదల చేసారు.రాజ్యాంగా పరిరక్షకురాలిగా శక్తి వంచన లేకుండా తాను సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానన్నారు. కోర్టు కేసులు, విమర్శలకు తాను భయపడనని తేల్చి చెప్పారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరని తమిళసై వ్యాఖ్యానించారు. కానీ, రాజ్ భవన్ కు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉందన్నారు.

Governor Tamilsai made interesting comments over gap between Raj Bhavan And Pragathi Bhavan

జిల్లాల పర్యటనకు వెళ్తే ఐఏఎస్ అధికారులు రారని గవర్నర్ చెప్పుకొచ్చారు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు. ప్రభుత్వంతో అభిప్రాయ బేధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టత ఇచ్చారు. ఆర్టీసీ బిల్లు తనకు ప్రభుత్వం నుంచి అందిందని..లోపాలను గుర్తించి తిరిగి పంపానని వివరించారు. బిల్లులను తిరిగి పంపటంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. సీఎం కేసీఆర్ కు చాలా రాజకీయ అనుభవం ఉందని వ్యాఖ్యానించిన గవర్నర్, కేసీఆర్ ను చూసి చాలా నేర్చుకున్నానంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. సీఎంతో ఎలాంటి దూరం లేదని చెప్పుకొచ్చారు. దూరం గురించి తాను పట్టించోనని..తన దారి తనదేని గవర్నర్ పేర్కొన్నారు.

తన కుటుంబం నేపథ్యం అంతా సేవ చేయాలనే భావన ఉందన్నారు. తను పుదుచ్చేరికి గవర్నర్ గా ఉన్నానని..తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదన్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదన్నారు. అవరసమైన అర్హతలు ఉంటే సంతకం చేయటానికి ఎలాంటి ఇబ్బంది లేదని గవర్నర్ చెప్పుకొచ్చారు. కేంద్రం - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. తనకు, తెలంగాణకు మధ్య దేవుడి ఇచ్చిన బంధం ఉందని..మరో 30 ఏళ్లు ఇదే రకంగా ఉంటానంటూ గవర్నర్ కొంత ఉద్వేగానికి లోనయ్యారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+