నేను స్ట్రాంగ్ పర్సన్‌ని - ఎవరికీ లొంగను : రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్ - గవర్నర్ తమిళిసై..!!
తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేసారు. రాజ్ భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు.. సీఎం కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు. కొంత కాలంగా ప్రగతి భవన్ - రాజ్ భవన్ మధ్య దూరం పెరుగుతోంది. ఉగాది వేడులకు కేసీఆర్ రాజ్ భవన్ కు హాజరవుతారని..దీంతో ఆ గ్యాప్ సమిసిపోతోందని అంచనాలు వ్యక్తం అయ్యాయి. కానీ, ముఖ్యమంత్రితో సహా ఎవరూ హాజరు కాకపోవటం చర్చకు కారణమైంది.

పెరుగుతున్న గ్యాప్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సమయంలో సాధారణంగా గవర్నర్ ప్రసంగం ఉంటుది. కానీ, ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించారు. గత సభలను ప్రోరోగ్ చేయకపోవటంతో..గవర్నర్ ప్రసంగం అవసరం లేదనే వాదన అధికార పార్టీ నేతల నుంచి వినిపించింది. కొద్ది నెలల క్రితం హుజూరాబాద్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ తెలంగాణ కేబినెట్ గవర్నర్ కు సిఫార్సు చేసింది.
అయితే, ఆ ఫైల్ ను గవర్నర్ పక్కన పెట్టారు. కౌశిక్ పైన ఉన్న కేసుల పైన సమాచారం సేకరిస్తున్నానని.. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తన ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను ప్రారంభించటం పైన గవర్నర్ అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేసారు.

రాజ్ భవన్ లో ఇక ప్రజాదర్బార్
యాదాద్రి ఉద్ఘాటన ఉత్సవానికీ గవర్నర్‌ను ఆహ్వానించలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ వేళ రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరదూరంగానే ఉన్నారు. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. ఇక, ఈ సమయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు కారణమయ్యాయి.
శుభకృత్ నామ సంవత్సరం తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని, ఈ ఏడాది ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని ఆకాంక్షించారు. వచ్చే నెల నుండి రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్టు గవర్నర్ ప్రకటించారు. అదే సమయంలో రాజ్ భవన్ పరిమితులు ఏంటో తనకు తెలుసని చెప్పుకొచ్చారు. తాను ఎనర్జిటిక్ పర్సన్ అని చెప్పారు.
Recommended Video


ఎవరూ నియంత్రించలేరంటూ
తనను ఎవరూ నియంత్రించలేరంటూ వ్యాఖ్యానించారు. తనకు ఎలాంటి ఇగో లేదని.. ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి ఉంటే తప్పకుండా వెళ్లేదాన్నని గవర్నర్ పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా.. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని సూచించారు. ఆప్యాయంగా ఉండాలని.. అందరం కలిసి తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం అంటూ వ్యాఖ్యానించారు.
ఫ్రెండ్లీ గవర్నర్ రాజ్ భవన్ లో ఉన్నారని తమిళి సై చెప్పారు. కేంద్రం తీరు పైన రాజకీయంగా పోరాటం చేస్తున్న కేసీఆర్.. ఇప్పుడు గవర్నర్ కార్యక్రమాలకు హాజరు కాకపోవటంతో ఇది మరో రాజకీయ చర్చకు కారణమంగా మారింది. దీని పైన టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications