సాయిబాబా గుళ్లలో హిందూ దేవుళ్లెందుకు?: గోవిందానంద స్వామి
హైదరాబాద్: షిర్డీ సాయిబాబా మందిరాలలో హిందువుల దేవుళ్ల విగ్రహాలు పెట్టడం సరికాదని, సాయి దేవాలయాల్లో తమ దేవుళ్ల విగ్రహాలు పెట్టకుండా పూజలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని శ్రీ గోవిందానంద స్వామి గురువారం అన్నారు.
సనాతన ధర్మాలకు, శంకరాచార్యుల సంప్రదాయాలకు విరుద్ధంగా, మతమే లేని సాయిబాబా దేవాలయాల్లో హిందువుల దేవతల విగ్రహాలు అవసరం లేదన్నారు. ఎవరు పడితే వారు పీఠాలు పెడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు.
దేనికైనా శాస్త్రమే ప్రమాణమని చెప్పారు. సాయికి చేస్తున్న పూజలు ఏ శాస్త్రంలో ఉన్నాయో చెప్పాలన్నారు. పూజలు ఇలా చేయాలని ఎక్కడ రాసి ఉందని ప్రశ్నించారు. హిందూమత శాస్త్రాల్లోని అంశాలనే తీసుకొని వాటిని కలుషితం చేస్తున్నారన్నారు.

రామాయణం, మహాభారతం హిందువుల పరమపవిత్రమైన పురాణాలు అని చెప్పారు. వాటిపై రమణానంద అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. రామాయణ, మహాభారతాలను తప్పుపట్టేవారు సాయిదేశం పేరిట ఓ దేశం పెట్టుకొని వెళ్లిపోవాలన్నారు.
కాగా, మంచి, మానవత్వం, ఆధ్యాత్మికం అంశాలను బోధించాల్సిన ఇద్దరు స్వాములు శివాలెత్తిన విషయం తెలిసిందే. భక్తుల మధ్యే వాగ్వాదానికి దిగారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత కనిపించింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిను అదుపులోకి తెచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications