వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్కారు దవాఖానాలు ప్రయివేటు ఆసుపత్రులతో పోటీ పడాలి.!ప్రజారోగ్యమే లక్ష్యమన్న హరీష్ రావు.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు పెరగాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ దవాఖానాలంలో నార్మల్ డెలివరీలు ఎక్కువగా జరగాలని, ప్రజల ఆరోగ్యం కోసం మార్పు తెద్దామని సిబ్బందికి మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. సర్కారు దవాఖానలో అన్నీ వసతులు ఉన్నాయని, అన్నీ రకాల వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలతో గ్రామాల వారీగా ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు, ప్రయివేటు ఆసుపత్రిలలో ప్రసవాలు, వాటిలో నార్మల్, సిజేరియన్ల అంశాలపై మంత్రి హరీష్ రావు సుదీర్ఘంగా సమీక్షించారు.

 పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు..తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలన్న మంత్రి హరీష్

పెద్ద ఆపరేషన్లను ప్రోత్సహించొద్దు..తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలన్న మంత్రి హరీష్


ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రికి తేడా ఏమిటో తెలియ చేయాలని మంత్రి హరీష్ రావు స్పష్టం చేసారు. ప్రయివేటు దవాఖానకు పోతే ఖర్చవుతుందని,పెద్ద ఆపరేషన్లు చేయొద్దని, తల్లి, బిడ్డల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని సూచించారు. గర్భిణీలకు ఆసుపత్రిలో వ్యాయామం చేయించాలని, దీంతో నార్మల్ డెలివరీలు సులభంగా చెయొచ్చుననే విధానం తీరు, పెద్ద ఆపరేషన్ల ద్వారా జరిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. గ్రామాల వారీగా ఆశాకార్యకర్తలు, ఏఎన్ఏంలు ప్రతీ మనిషి ఆరోగ్య స్థితిగతులైన బీపీ, షుగర్ తదితర వ్యాధులు గుర్తించిన అంశాలపై ఆరా తీసి ప్రభుత్వమే ఇంటింటికీ వెళ్లి ఎన్సీడీ కిట్లు పంపిణీ చేయాలని ఆరోగ్య శాఖ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.

 తల్లి పాల విశిష్టత.. అవగాహనతీసుకురావాలన్న మంత్రి హరీష్ రావు

తల్లి పాల విశిష్టత.. అవగాహనతీసుకురావాలన్న మంత్రి హరీష్ రావు

నార్మల్ డెలివరీలు చేయిస్తే మూడు వేలు పారితోషికం అందజేసి ప్రోత్సహించాలన్నారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేయిస్తే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఏం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలకు మూడు వేల పారితోషికం అందిస్తామని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు చెప్పారు. గోల్డెన్ అవర్ మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఎంత అవసరమో దాని ప్రాముఖ్యత వివరిస్తూ.. మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు తాగించాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు మంత్రి హరీష్ రావు.

 మందుల నిలువలు ఉండాలి.. సిబ్బందికి మంత్రి ఆదేశాలు

మందుల నిలువలు ఉండాలి.. సిబ్బందికి మంత్రి ఆదేశాలు


పీహెచ్ సీలో ఈ ఔషధి, కుక్కకాటు, పాముకాటు ఇతరత్రా వ్యాధుల మందులు మూడు నెలలకు సరిపడేలా నిలువలు ఉన్నాయా.. లేదా అని ఫార్మాసిస్టును ఆరా తీశారు. అవసరమైన మందులు తెప్పించి పెట్టాలని డీఏంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్ ను ఆదేశించారు. అక్కన్నపేట మండలంలో క్యాంపు నిర్వహించి పైసా ఖర్చు లేకుండా క్యాటారాక్ట్ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామని, అలాగే మూడు లక్షల ఖర్చుతో కూడిన మోకాలి చిప్ప ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.

 గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పూర్వ వైభవం.. మంత్రి హరీష్ రావు కృషిని ప్రశంసించిన అధికారులు

గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పూర్వ వైభవం.. మంత్రి హరీష్ రావు కృషిని ప్రశంసించిన అధికారులు


1300 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సతీష్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. ఆరోగ్య మంత్రి హరీశ్ రావు చొరవతో అక్కన్నపేట మండలం రామవరం గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పూర్వ వైభవం వచ్చిందని స్థానిక ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు పీహెచ్ సీలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ గారి బీపీ చెకప్ చేశారు.

English summary
Health Minister Harish Rao wants to increase deliveries in government hospitals. Minister Harish Rao directed the staff to make more normal deliveries in government hospitals and make changes for the health of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X