ఉద్యోగులకు గుడ్ న్యూస్ - డీఏ క్లియర్, ఐఆర్ ప్రకటన..!?
ఉద్యోగులకు దసరా వేళ గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల తొలి వారంలో విడుదల కానుంది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నియామంతో పాటుగా పెండింగ్ డీఏ ఒకటి విడుదల..అదే సమయంలో మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఐఆర్ ఏ మేర ప్రకటించే అవకాశం ఉందనే దాని పైన చర్చ సాగుతోంది.
కీలక ప్రకటన దిశగా :ఎన్నికల వేళ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దం వుతోంది. ఈ నెల 29న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల తొలి వారంలో విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఉద్యోగుల పీఆర్సీపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, అధికారికంగా నియమక ప్రక్రియకు ఆమోదం తెలపాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ సారి జరిగే కేబినెట్ భేటీలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనేదే ప్రధాన ఎజెండా కానుందని అధికారవర్గాల సమాచారం.

డీఏ క్లియర్.. ఐఆర్ ప్రకటన:ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పటి వరకు మూడ డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో ఈ భేటీలో ఒకటి విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాలు నూతన పీఆర్సీలో 22 -30 శాతం వరకు ఫిట్ మెంట్ ఆశిస్తున్నారు. దీని పైన ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ భేటీలో ఫిట్ మెంట్ పైన నిర్ణయం ప్రకటించటం ఖాయంగా భావిస్తున్నారు. 10 నుంచి 20 శాతం మధ్య ఫిట్ మెంట్ ప్రకటన ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీని పైన అటు ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు తెలుసుకొని...ప్రభుత్వ ఆర్దిక పరిస్థితిని వివరిస్తూ పీఆర్సీ నివేదిక వచ్చే వరకూ అమలు చేసే విధంగా ప్రభుత్వం మద్యే మార్గంగా ఫిట్ మెంట్ ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఉద్యోగుల్లో ఉత్కంఠ:విశ్రాంత ఐఏఎస్ అధికారులతో పీఆర్సీని క్యాబినెట్ ఆమోదించనున్నట్లు సమాచారం. పీఆర్సీలో వీకే అగర్వాల్, రాజేశ్వర్ తివారి, బీఆర్ మీనా, రాణి కుముదిని, బూసాని వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి, శివశంకర్ వంటి విశ్రాంత ఐఏఎస్ లతోపాటు.. బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉంటారని తెలుస్తోంది. ఐఆర్, పీఆర్సీపై స్పష్టమైన వైఖరితో సర్కారు ఉందని, వాటిపై నిర్ణయాలను ప్రకటన లాంఛనంగా చేయనుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అన్ని వర్గాల మద్దతుతో మూడో సారి అధికారం దక్కించుకొనే క్రమంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయాల పైన ఉద్యోగుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications