వారి పెన్షన్లు కోత, కొత్తగా వీరికే ఛాన్స్ - తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు..!!
తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పైన కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత కొత్త పెన్షన్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటి పైన ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అధికారంలోకి వస్తే పెన్షన్ల పెంపు పైన హామీ ఇవ్వటంతో.. కొత్త పెన్షన్ల మంజూరు పైన తుది నిర్ణయం జరగలేదు. కాగా, ఇప్పుడు ప్రభుత్వం అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.
తెలంగాణలో ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న పెన్షన్ లబ్ది దారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5.20 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫించన్ లబ్ది దారుడు మరణించినా.. ఆయన భార్యకు పెన్షన్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసినా మంజూరు కావటం లేదు. దీంతో.. ఇప్పుడు తాజా మార్గదర్శకాలతో అర్హుల జాబితా సిద్దం చేయాల ని ప్రభుత్వం నిర్దేశించింది. నూతన ఆసరా పెన్షన్ల కోసం అర్హుల జాబితా ఖరారు తరువాత అమలు పైన తుది నిర్ణయం ప్రకటించనున్నారు. పెన్షన్ల పైన ఇటీవల సమీక్ష చేసిన సమయం లో సెర్ప్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున.. కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని నిర్ణయించింది.

కొత్త పెన్షన్ల కోసం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గ్రామాల్లో పంచాయితీ కార్యదర్శులు, పట్టణాలు .. నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తుల పైన క్షేత్ర పరిశీలనలు చేయించాలని పేర్కొంది. కాగా, వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ది దారుల జాబితా ఆధారంగా పరిశీలన చేసి వారి సతీమణులకు అర్హత ఉంటే వారి పేరుతో జాబితా సిద్దం చేయనున్నారు. పెన్షనర్ ఐడీ, మరణ సర్టిఫికెట్, లబ్ది దారుని ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు సేకరించాలి. వరుసగా మూడు నెలల పెన్షన్ వారిని వలస వెళ్లినట్లుగా గుర్తించి వారి పెన్షన్ ను రద్దు చేయాలని సూచించారు. వారి భార్యలు అర్హులు అయితే, వారి పేర్లతో ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఆసరా పథకం కింద 42.96 లక్షల మంది వృద్దులు.. వితంతువులు.. ఒంటరి మహిళలు, దివ్యాంగులు.. చేనేత, గీత, బీడీ కార్మికులు.. పైలేరియా, హెచ్ఐవీ, కిడ్నీ వ్యాధి బాధితులు పెన్షన్ పొందుతున్నారు.












Click it and Unblock the Notifications