రైతు భరోసా నిధులు జమ - అందని వారికి కీలక సూచనలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా నిధులను ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. విడతల వారీగా అందరికీ భరోసా నిధులను అందిస్తామని తాజాగా ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో అమలైన రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా గా మార్పు చేసారు. గతం ఇచ్చిన మొత్తం కంటే ఎకరానికి అదనంగా రూ.1000లను పెంచి అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మూడు ఎకరాల రైతులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఈ రోజు మరో విడత నిధులను జమ చేసింది.
నిధులు విడుదల
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు విడతలుగా ఒక ఏడాదిలో ఎకరాకు రూ.12,000 జమచేస్తున్నారు. రైతు భరోసా అర్హతల పైన సుదీర్ఘ కసరత్తు తరువాత ప్రభుత్వం అమలు నిర్ణయం తీసుకుంది. జనవరి 26 నుంచి అమలు ప్రారంభించింది. ఇప్పటి వరకు 3 ఎకరాల్లోపు భూమి ఉన్నటువంటి అన్నదాతల అకౌంట్లలో డబ్బులను జమచేసారు. తాజాగా 3 ఎకరాల నుంచి 4 ఎకరాల మధ్య భూమి ఉన్న రైతుల అకౌంట్లలో జమ చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం అమలు కోసం మొత్తంగా 54.74 లక్షల మంది రైతులకు రూ.4666 కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది.
జమ కాకుంటే
రైతు భరోసా నిధులను అర్హులైన ప్రతీ రైతు ఖాతాలో ఈ నెలాఖరులోగా జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా... కొంత మంది రైతులు బ్యాంకు ఖాతా నెంబర్లు ఇవ్వటంతో పొరపాట్లు.. అదే విధంగా కొన్ని సాంకేతిక కారణాలతో ఎకరం వరకు భూమి ఉన్న కొంతమందికి ఇప్పటివరకు నిధు లు జమకాలేదు. కాగా ఇటీవల వ్యవసాయ అధికారులు ఆయా రైతుల నుంచి సరైన వివరాలను సేకరించారు. మార్చి 25వ తేదీన వారి ఖాతాల్లో భరోసా నిధులను జమ చేసినట్లు అధికారులు వెల్ల డించారు. అదే విధంగా కొత్తగా పాస్ బుక్ పొందిన రైతులకు ఈ పథకం ద్వారా నిధులు జమ కాలే దు. కొందరు రైతులు మూడు ఎకరాల్లోపు ఉన్న వారికి నిధులు జమ కాలేదని ఫిర్యాదులు అందు తున్నాయి. దీంతో, కొత్తగా పాస్ బుక్ పొందిన వారు బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలని అధికా రులు సూచిస్తున్నారు.

నెలాఖరు లోగా
నాలుగు ఎకరాల్లోపు ఉన్న కొత్త, పాత రైతుల ఖాతాల్లో నిన్నటి నుంచి రైతుభరోసా నిధులు నేరుగా జమ అవుతున్నాయి. అయితే, నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నటువంటి రైతుల అకౌంట్లలో ఈ నెలఖరులోగా డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. మరో అయిదు రోజుల్లో ఈ నెల పూర్తి కానుంది. ఆర్దిక సంవత్సరం ముగింపు వేళ కావటం.. వరుస సెలవులతో ప్రభుత్వం ముందుగానే నిధుల సర్దుబాటు పైన ఫోకస్ చేసింది. రైతు లకు చెప్పిన విధంగా ఈ నెలాఖరులోగా పెండింగ్ నిధులను విడుదల చేసేందుకు చర్యలు తీసు కొంటున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications