Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతుబంధు అమల్లో సీలింగ్ - ఎన్ని ఎకరాలకంటే, వాళ్లందరికీ కట్‌..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రైతుబంధు పథకం పైన పునఃసమీక్షించాలని ఇప్పటికే నిర్ణయించారు. అనర్హులకు ఈ పథకం అమలవుతుందని..అర్హత ఉన్న రైతులకే వర్తించే లా అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో రైతుభరోసాకు సీలింగ్ పెట్టే ఆలోచన చేస్తోంది. ఎంత వరకు పరిమితం చేయాలనే దాని పైన కసరత్తు జరుగుతోంది. అధికారులు నివేదిక రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకొనే తుది నిర్ణయం కీలకంగా మారనుంది.

సీలింగ్ తప్పదా : రైతులకు పంట పెట్టుబడికోసం ఆర్థిక సాయం అందించే రైతుభరోసా పథకానికి సీలింగ్‌ విధించే అవకాశం కనిపిస్తోంది. రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు రైతుభరోసా అందుతోందని..దీనిని నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. పథకంలో మార్పులకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని 'ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌'ను సంప్రదించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు, బీడు భూములను గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

Govt to take final decision on officials proposals for Ceiling on Rythubandhu implementation

అధికారుల కసరత్తు : ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా అమలులోకి రానుంది. సీలింగ్ గురించి అసెంబ్లీలో చర్చ చేసిన తరువాతనే తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ఇటు ఈ సాయాన్ని ఐదెకరాలకా లేదా పదెకరాలకా.. ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఐదెకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ సర్కారు రైతుభరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.22,800 కోట్లు అవుతుంది. అలాకాకుండా ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే, పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతుల్లో వారు 62.34 లక్షల మంది ఉన్నారు. వీరికి మాత్రమే రైతుభరోసా పరిమితం చేయాలనుకుంటే.. రూ. 15వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా.

Govt to take final decision on officials proposals for Ceiling on Rythubandhu implementation

ఎలా అమలు చేద్దాం : వీరికే అమలు చేయటం ద్వారా గత ప్రభుత్వం కన్నా రూ.5 వేలు ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుందని.. అదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా రూ. 7,800 కోట్లు ఆదా చేసుకోవచ్చని అంటున్నాయి. సాగుభూములకే రైతుభరోసా ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. సాగుచేయని, సాగు­కు పనికిరాని కొండలు, గుట్టలకు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతుబంధు ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. అధికారులు దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్‌ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా అమలులోకి రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+