ప్రజల మధ్య విద్వేశాలొద్దు: బాబుపై గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెక్షన్ 8 పేరుతో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (గ్రాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ లక్ష్మణరెడ్డి కోరారు.
గ్రాట్ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో మేము సురక్షితం' అంటూ రూపొందించిన బ్రోచర్‌ను ఆదివారం గ్రాట్ అధ్యక్షుడు, విశ్రాంత ఐజీ హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు కే జగన్‌మోహన్‌రెడ్డి, కొండారెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణలో ఇతర రాష్ట్రాల వారికి ఎలాంటి భంగం వాటిల్లలేదని, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తెలిపారు.
ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిన ఏపీ సీఎం, ఆ మరకలు చెరిపి వేసుకునేందుకు అమాయక ప్రజల మధ్య సెక్షన్-8 పేరుతో విద్వేశాలను రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. సమావేశంలో గ్రాట్ సహాయ కార్యదర్శులు చిదానంద, ప్రకాశ్ రెడ్డి, సభ్యులు కులేశ్వర్‌రెడ్డి, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications