సీఎం కేసీఆర్‌కు నిజాం మనవడి లేఖ... మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్మారక విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి...
ఒకప్పటి హైదరాబాద్ సంస్థానానికి చివరి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు హిమాయత్ అలీ మీర్జా తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ నగరంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్మారక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే మీర్ ఉస్మాన్ అలీఖాన్ జయంతి లేదా వర్ధంతిని సెలవు దినంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ప్రజల కోసం,నగర అభివృద్ది కోసం ఎంతో కృషి చేసిన మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు సంబంధించి... నగరంలో ఒక్క స్మారక విగ్రహం కూడా లేకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు తగిన గుర్తింపునివ్వడం ద్వారా భవిష్యత్ తరాలు ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటాయని అన్నారు.

పీవీ విగ్రహ ఏర్పాటును ప్రస్తావించి...
ఇటీవల హుస్సేన్ సాగర్ ఒడ్డున పీవీ ఘాట్‌లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హిమాయత్ అలీ మీర్జా సంతోషం వ్యక్తం చేశారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ విగ్రహాన్ని కనీసం ఒక్కటైన నగరంలో ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్‌లో విమానాశ్రయం,హైకోర్టు,రిజర్వాయర్లు,ఉస్మానియా యూనివర్సిటీ,ఉస్మానియా ఆస్పత్రి,ఫలక్‌నుమా ప్యాలెస్ తదితర నిర్మాణాలన్నీ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో జరిగినవేనని గుర్తుచేశారు.

ఆ భూములను వాడుకోవాలని...
అప్పట్లో రక్షణ శాఖకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ 5వేల కేజీల బంగారాన్ని విరాళమిచ్చారని... ఇప్పటి ధర ప్రకారం దాని విలువ రూ.1600 కోట్లు అని చెప్పారు. గతంలో ఫలక్‌నుమా ప్యాలెస్‌ను సందర్శించిన సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఆ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయారని గుర్తుచేశారు.గతంలో అర్బన్ భూ చట్టం(సీలింగ్ అండ్ రెగ్యులేషన్స్) 1976 ద్వారా నిజాం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని... కానీ 1999లో ఆ చట్టం రద్దయిందని హిమాయత్ అలీ మీర్జా తన లేఖలో గుర్తుచేశారు. ఆ భూములను ప్రభుత్వం పార్కులు,గ్రీనరీ కోసం వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఆ భూములను గుర్తించేందుకు వ్యక్తిగతంగా తాను కూడా సహకరిస్తానని చెప్పారు.
Recommended Video

మోదీకి లేఖ... వాటిని హైదరాబాద్ తరలించాలని...
ఇటీవలే
ప్రధాని
నరేంద్ర
మోదీకి
సైతం
తాను
లేఖ
రాసిన
విషయాన్ని
హిమాయత్
అలీ
మీర్జా
గుర్తుచేశారు.ఆర్బీఐ
ఆధీనంలో
ఉన్న
నిజాం
బంగారు
ఆభరణాలను
హైదరాబాద్‌కు
తరలించాలని
ప్రధానిని
కోరినట్లు
చెప్పారు.
తద్వారా
హైదరాబాద్‌లోనే
స్పెషల్
మ్యూజియం
ఏర్పాటు
చేసి
వాటిని
ప్రదర్శనకు
పెట్టే
అవకాశం
ఉంటుందన్నారు.
అలా
చేస్తే
ప్రభుత్వానికి
ఆదాయంతో
పాటు
స్థానికంగా
కొంతమందికి
ఉద్యోగ,ఉపాధి
దొరుకుతుందన్నారు.
మీర్
ఉస్మాన్
అలీఖాన్
చేసిన
అభివృద్ది
పనులకు
ఎంత
మంచి
గుర్తింపు
ఉన్నదో...
ఆయన
నిరంకుశ
పాలనపై
విమర్శలు
కూడా
ఉన్నాయి.
అసలే
రాష్ట్రంలో
బీజేపీ
కాస్త
పుంజుకుంటున్నట్లు
కనబడుతోంది.
ఇలాంటి
సమయంలో
నిజాం
మనవడి
ప్రతిపాదనలపై
సీఎం
కేసీఆర్
సానుకూలంగా
స్పందిస్తే
బీజేపీ
దాన్ని
తమకు
అనుకూలంగా
మలుచుకునే
ప్రయత్నం
చేయకపోదు.
ఈ
నేపథ్యంలో
సీఎం
కేసీఆర్
నిజాం
మనవడి
లేఖపై
ఎలా
స్పందిస్తారో
వేచి
చూడాలి.