ఆ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో రెవెన్యూ, హౌసింగ్, ఐఅండ్ పీఆర్ బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై డిప్యటీ సీఎం భట్టి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలను షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ప్రచారం చేయాలన్నారు. షార్ట్ ఫిల్మ్స్ కు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తోందని డిప్యటీ సీఎం భట్టి తెలిపారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లు నిర్మించాలని ఆదేశించారు. మధ్యతరగతి ప్రజలకు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్లు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

డిజిటల్ భూసర్వేకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాలని సూచించారు. ప్రభుత్వ ఆఫీసు భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
మరోవైపు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఎల్బీసీ, డిండి, పాలమూరు-రంగారెడ్డి పనుల్లో జాప్యం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. నీటిపారుదల రంగం పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రాజెక్టుల పురోగతిపై పర్యవేక్షణ పెంచాలన్నారు. నీటి నిల్వల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.












Click it and Unblock the Notifications