ఉత్తర తెలంగాణా జిల్లాలకు భారీ శుభవార్త.. పండుగ చేసుకోండి!
హైదరాబాద్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. ఇక తాజాగా ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కల్పించే దిశగా సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ లకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
సికింద్రాబాద్ ఎలివేటేడ్ కారిడార్ లకు గ్రీన్ సిగ్నల్
సికింద్రాబాద్ పారడైజ్ జంక్షన్ నుంచి ఉత్తర తెలంగాణ వైపు ప్రభుత్వం రెండు కీలకమైన కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ కారిడార్ల నిర్మాణానికి రక్షణశాఖకు చెందిన భూములు అవసరం ఉన్న నేపథ్యంలో ఇంతకాలం ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. అయితే ఈ ప్రాజెక్టులకు అవసరమైన రక్షణశాఖకు చెందిన భూములను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి బదిలీ చేయడానికి ఇటీవల ఆమోదం లభించడంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమైంది.

సికింద్రాబాద్ ఎలివేటేడ్ కారిడార్ ల కోసం చారిత్రక ఒప్పందం
రక్షణశాఖకు చెందిన భూములను తీసుకుని దానికి బదులు రక్షణశాఖకు అదే విలువ గలిగిన ప్రభుత్వ భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రక్షణశాఖకు బదిలీ చేయనున్న భూముల విలువ సుమారు ఒక వెయ్యి 18కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. రక్షణ శాఖకు చెందిన భూములకు బదులుగా వేరే భూములను ఇవ్వడానికి ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం, ఫైనల్ గా సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సిద్ధమైంది.
భూములకు బదులు రక్షణ శాఖకు భూములు
ప్యారడైజ్ జంక్షన్ నుండి షామీర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డువరకు 18కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్, ప్యారడైజ్ నుంచి జాతీయరహదారి ఎన్ హెచ్ 44మీదుగా డైరీఫాం వరకు ఐదు కిలోమీటర్ల మరొక కారిడార్ నిర్మించనుంది. ఈ నిర్మాణాలకోసం ఆల్వాల్ లోని కౌకూర్, షామీర్పేటలోని సింగైపల్లి, తూంకుంట, కాప్రా జవహర్ నగర్ లోని మండలాలలోని రక్షణశాఖ భూములు తీసుకుంటున్న తెలంగాణప్రభుత్వం వీటికి ప్రత్యామ్నాయంగా అదే మండలాలలో విలువైన భూములను రక్షణశాఖకు ఇస్తోంది.
కారిడార్ లకు టెండర్ల పరిస్థితి ఇలా
ఈ భూమి బదిలీ కావడంతోనే సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ల పనులు ప్రారంభమవుతాయి. 5కిలోమీటర్లు డైరీ ఫామ్ ఎలివేటెడ్ కారిడార్ కు సంబంధించిన టెండర్లు ఇప్పటికే పూర్తికాగా, 18కిలోమీటర్ల శామీర్పేట కారిడార్ కు ఈ నెలాఖరులోగా టెండర్లు పిలవాలని హెచ్ఎండిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కారిడార్ల నిర్మాణంలో బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద 600మీటర్ల భారీ టన్నెల్ నిర్మాణం చేయనున్నారు.
రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఈ జిల్లాల వారికి సిగ్నల్ ఫ్రీ జర్నీ
ఎయిర్పోర్ట్ కార్యకలాపాలకు భద్రతా ప్రమాణాలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఈ టన్నెల్ కీలకంగా మారడంతో టన్నెల్ నిర్మాణాన్ని సవాల్ గా తీసుకుని చేపట్టనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్, సికింద్రాబాద్ ల నుండి మేడ్చల్, కరీంనగర్ వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలకు ఫుల్ స్టాప్ పడుతుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications