• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆకుపచ్చ తెలంగాణ.!గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశానికే ఆదర్శమన్న సద్గురు జగ్గీ వాసుదేవ్.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం ద్వారా పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని, మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పష్టం చేసారు. తన ప్రపంచ పర్యటనలో భాగంగా తెలంగాణాలోకి ప్రవేశించగానే భారీ పచ్చదనం ఆకర్షించిందని అన్నారు.
వ్యవసాయంలో రసాయనాల వాడకంతో నేల తల్లి జీవం కోల్పోతోందని, రానున్న తరాలకు ఇది పెనుముప్పు కాబోతోంది అన్నారు సద్గరు జగ్గీ వాసదేవ్. పుడమికి, మట్టికి ప్రత్నామ్నాయం లేదని, వీలైనంతగా కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను హైదరాబాద్ లో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించారు.

 తెలంగాణ పచ్చదనం పెంపు..మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలన్న జగ్గీ వాసుదేవ్

తెలంగాణ పచ్చదనం పెంపు..మిగతా రాష్ట్రాలు ఈ పోటీని స్వీకరించాలన్న జగ్గీ వాసుదేవ్


సేవ్ సాయిల్ ఉద్యమాన్ని చేపట్టి ప్రపంచ యాత్ర చేస్తున్న సద్గురు హైదరాబాద్ మీదుగా బెంగుళూరు పయనమయ్యారు. మార్గ మధ్యలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదవ విడతను శంషాబాద్ సమీపంలోని గొల్లూరు అటవీ ప్రాంతంలో సద్గురు స్వయంగా మొక్కలను నాటి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, దండే విఠల్ పాల్గొని మొక్కలు నాటారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం సాధించిన పచ్చదనం పెంపు విజయాలను సద్గురుకు వివరించారు.

 దేశం పచ్చబడాలి...సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చొరవ అభినందనీయమన్న జగ్గీ

దేశం పచ్చబడాలి...సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చొరవ అభినందనీయమన్న జగ్గీ


అంతే కాకుండా ఎంపీ సంతోష్ చిన్న వయసులో పెద్ద బాధ్యత తీసుకున్నారన్నారు సద్గురు వాసుదేవ్. తక్కువ వయసులో పెద్ద కార్యక్రమం చేపట్టిన సంతోష్ కుమార్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని సద్గరు ప్రశంసించారు. సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రెండు ఉద్యమాల లక్ష్యం ఒక్కటేనని పుడమిని కాపాడుతూ, ప్రకృతి, పర్యావరణం ప్రాధాన్యతను ప్రతీ ఒక్కరికీ తెలియజెప్పటమేనని సద్గురు అన్నారు.

 గ్రీన్ ఇండియా విజయవంతం కావడం పూర్వజన్మ సుకృతం.. సద్గురుకు ధన్యవాదాలు తెలిపిన సంతోష్

గ్రీన్ ఇండియా విజయవంతం కావడం పూర్వజన్మ సుకృతం.. సద్గురుకు ధన్యవాదాలు తెలిపిన సంతోష్


గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతం కావడం పూర్వజన్మ సుకృతమని, సద్గురు ఆశీస్సులు అందుకోవడం మర్చిపోలేని సందర్మమని ఎంపీ సంతోష్ కుమార్ స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టామని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్ ఇండియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ సంతోష్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

 సద్గురు ఆశీస్సులతో తెలంగాణ పులకించింది.. మట్టిని కాపాడుకుందామన్న ఎంపీ సంతోష్

సద్గురు ఆశీస్సులతో తెలంగాణ పులకించింది.. మట్టిని కాపాడుకుందామన్న ఎంపీ సంతోష్


సద్గురు ఆశీస్సులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందుకోవటం అపురూప ఘట్టంగా భావిస్తున్నామని సంతోష్ కుమార్ తెలిపారు. త్వరలోనే మరిన్ని వినూత్న కార్యక్రమాలు తీసుకుంటామని అన్నారు. గొల్లూరు ప్రాంతంలో క్షీణించిన అటవీ ప్రాంతంలో భారీగా చెట్లను పెంచి, చిక్కని పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ ను అటవీ శాఖ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టింది. మొదటి దశలో ఇప్పటికే సుమారు తొమ్మిది వందల ఎకరాల అటవీ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అటవీ పునరుద్దరణ పనుల్లో భాగంగా, ఐదవ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఒకేసారి పదివేల పెద్ద మొక్కలను నాటారు.

English summary
Sadguru Jaggi Vasudev made it clear that the greening of Telangana through greenery and the Green India Challenge programs are an ideal for the country and the rest of the states should embrace this competition. He said that he was attracted to the huge greenery when he entered Telangana as part of his world tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X