Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గంటలో పెళ్లి ఉందనగా.. వధువు ఫ్యామిలీకి బిగ్ షాకిచ్చిన వరుడు,అతని కుటుంబం

పెళ్లంటే... నూరేళ్ల బంధం.. ఒకరికి ఒకరుగా చిరకాలం తోడు ఉంటామని వధూవరుల మధ్య కొనసాగే ఒప్పందం. వేదమంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఇద్దరూ కలిసి ఉండాలని చేసుకునే నిర్ణయం. ధర్మేచ, అర్ధేచ, కామేచ , మోక్షేచ నాతి చరామి అని ప్రమాణం చేస్తాడని భావిస్తే ఊహించని షాక్ ఇచ్చి వివాహ వేడుకను అభాసుపాలు చేశాడో ప్రబుద్ధుడు. అతను మాత్రమే కాదు అతని కుటుంబం కూడా వధువు కుటుంబానికి షాకిచ్చిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే

 వివాహ వేడుకకు సిద్ధమైన కుటుంబాలు .. సంగారెడ్డిలో పెళ్లి

వివాహ వేడుకకు సిద్ధమైన కుటుంబాలు .. సంగారెడ్డిలో పెళ్లి


తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్నాపూర్ కు చెందిన ఓ యువతిని కొండాపూర్ మండలం మల్కాపూర్ కు చెందిన మాణిక్ రెడ్డి కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఆరు నెలల క్రితమే ఎంగేజ్మెంట్ కూడా చేశారు. అంతేకాదు పెళ్లి కొడుకుకి భారీగా కానుకలను ముట్ట చెప్పేందుకు కూడా అమ్మాయి కుటుంబం అంగీకరించింది. ఈనెల 12వ తేదీన వివాహ వేడుకను నిర్వహించడానికి నిర్ణయం కూడా తీసుకున్నారు. సంగారెడ్డిలో ఘనంగా పెళ్లి చేయాలని బంధుమిత్రులను ఆహ్వానించారు.

 వరుడి కోసం వెళ్ళిన వధువు బంధువులు .. వరుడు ఇంటికి తాళం

వరుడి కోసం వెళ్ళిన వధువు బంధువులు .. వరుడు ఇంటికి తాళం


ఇక వధువు ఇంటి దగ్గర బంధుమిత్రుల సందడి మధ్య అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్యాణ ముహూర్తానికి పెళ్లి మండపాన్ని కూడా చక్కగా అలంకరించారు. ఆ తర్వాత పెళ్లి కొడుకును తీసుకురావడానికి సాంప్రదాయం ప్రకారం అమ్మాయి తరపు బంధువులు అబ్బాయి ఇంటికి వెళ్లారు. తీరా అక్కడ సీన్ చూసి వెళ్లిన వాళ్లు అవాక్కయ్యారు. వరుడు ఇంటికి తాళం వేసి ఉండటంతో ఒక్కసారిగా అందరూ కంగుతిన్నారు. వరుడి కుటుంబం లేకపోవటంతో ఏం జరిగిందో అర్ధం కాక అయోమయానికి గురయ్యారు.

కట్నం నగదు, బంగారం తీసుకుని వరుడు పరార్ .. ఫ్యామిలీ కూడా మాయం

కట్నం నగదు, బంగారం తీసుకుని వరుడు పరార్ .. ఫ్యామిలీ కూడా మాయం

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే ఇంకొక గంటలో పెళ్లి జరుగుతుంది అనగా వరుడు మాణిక్ రెడ్డి కట్నం కింద ఇచ్చిన 25 లక్షల రూపాయల నగదును, 25 తులాల బంగారాన్ని తీసుకొని ఉడాయించాడు. మాణిక్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఏం చేయాలో పాలుపోక ఊరు విడిచి పారిపోయారు. వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి రూరల్ పిఎస్ పోలీసులు మోసం చేసి పారిపోయిన పెళ్లి కొడుకు ను, అతని కుటుంబ సభ్యులను పట్టుకోవడానికి గాలింపు చేపట్టారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి .. న్యాయం చెయ్యాలని డిమాండ్

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత యువతి .. న్యాయం చెయ్యాలని డిమాండ్


అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధిత యువతి వాపోతోంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన వ్యక్తి అడ్వకేట్ అని, బార్ అసోసియేషన్ మెంబర్ అని ఈ విధంగా మోసం చేస్తాడని తాను అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది వధువు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. తన తల్లిదండ్రులు తన పెళ్లి గ్రాండ్ గా చేయడం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారని, కట్నకానుకలు కూడా బాగా ఇచ్చారని, అన్నిటికీ ఒప్పుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం తాను జీర్ణించుకోలేకపోతున్నానని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తానని తేల్చి చెబుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+