జీఎస్టీ బిల్లు: 'కొత్త' ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం?, తాత్కాలికంగా..

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: జీఎస్టీ బిల్లు అమలులోకి వస్తే కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ సాగుతోంది. జీఎస్టీ అమలుతో ఆదాయం కోల్పోతామని ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

వస్తువును ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే అవకాశముంది. ఇందుకోసం ఒక శాతం పన్నును రాష్ట్రం కోసం వసూలు చేయాలని భావించినా, సవరణ బిల్లు నుంచి దానిని తొలగించారు. నష్టాల్ని భర్తీ చేస్తామని కేంద్రం హామీతో ఒకటి రెండు రాష్ట్రాలు మద్దతిచ్చాయి.

మొదటి ఏడాది వంద శాతం, రెండో ఏడాది 75 శాతం, మూడో ఏడాది 50 శాతం నష్టాల్ని భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఏపీకి కూడా కేంద్రం నుంచి హామీ లభించింది. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంది. విభజన సమయంలో రెవెన్యూ లోటు ఉంది.

 GST debate: Andhra Pradesh would temporarily benefit from bill, says TDP

జీఎస్టీ బిల్లు వల్ల ఏపీకి రూ.4,700 కోట్ల నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిని తొలి అయిదేళ్ల పాటు భర్తీ చేసేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎంత కోల్పోతామో.. కచ్చితంగా ఓ టైమ్ బాండులో కేంద్రం నుంచి దానిని భర్తీ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు, కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పన్నులలో ప్రోత్సాహకాలు ఇస్తోంది. జీఎస్టీ అమలైతే అన్నీ కేంద్రం అందులోకి వెళ్తాయి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ కార్యకలాపాల పైన ప్రభావం పడనుందని అంటున్నారు.

రాజ్యసభలో టిడిపి ఎంపీ సీఎం రమేష్ జీఎస్టీ బిల్లుపై మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తమ రాష్ట్రం ప్రస్తుతం రెండో స్థానంలో ఉందని, తాము నెంబర్ వన్ కావాలని పని చేస్తున్నామని చెప్పారు. జీడీపీ దేశానికి ప్లస్ అవుతుందని అందుకే తాము బిల్లుకు సహకరిస్తున్నామని చెప్పారు. జీఎస్టీ వల్ల ఏపీకి కూడా ప్రస్తుతం లాభమే అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP leader CM Ramesh said Andhra Pradesh would benefit from the GST bill. “Our state is number 2 in ease of doing business, we want to become number one. Even though our state will suffer some setback, it will help the GDP of the country and that is why were supporting the Bill.”

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి