మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, టెక్కీ నాగరాజు హత్య, కాల్ డేటా పట్టించింది

Posted By:
Subscribe to Oneindia Telugu
  Another Nagarkurnool Swathi Found : మరో స్వాతి: ప్రియుడితో రాసలీలలు, హత్య

  హైదరాబాద్: నాగర్ కర్నూల్ స్వాతి తరహ కేసు మరోటి చోటు చేసుకొంది. ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సహయంతో భర్తను చంపేసింది భార్య. అయితే ఈ ఘటనలో జ్యోతి ఉపయోగించిన ఫోన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. అయితే అదే సమయంలో ఈ ఘటనలో పాల్గొన్న నరేష్ కూడ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఈ కేసు చిక్కుముడి వీడింది.ఈ ఘటన హైద్రాబాద్ కర్మన్‌ఘాట్‌లో చోటు చేసుకొంది.

  ప్రియుడితో వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్యే ఈ దారుణానికి ఒడిగట్టింది. నాగర్ కర్నూల్ స్వాతి కేసు తరహలోనే కర్మన్ ఘాట్‌లో నివాసం ఉంటున్న జ్యోతి కూడ వ్యవహరించింది.

  అయితే పోలీసులకు అనుమానం రాకుండా జ్యోతి వ్యవహరించింది. అయితే ఈ సమయంలో కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఈ కేసు చిక్కుముడిని విప్పారు. అయితే పోస్ట్‌మార్టం నివేదికలో మృతదేహం తల వెనుక భాగంలో తీవ్ర గాయాలున్నాయని గుర్తించారు. దీంతో ఈ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

  ప్రియుడితో రాసలీలల కోసం భర్తను చంపింది

  ప్రియుడితో రాసలీలల కోసం భర్తను చంపింది

  మహబూబ్‌నగర్ జిల్లా రాచర్లకు చెందిన జ్యోతి అదే గ్రామానికి చెందిన నాగరాజుతో ఐదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే వివాహనికి ముందే జ్యోతి కార్తీక్‌ అనే యువకుడితో ప్రేమలో పడింది. వారిద్దరూ పెళ్ళి చేసుకోవాలని భావించారు. కానీ, నాగరాజుతో తల్లిదండ్రులు వివాహం చేశారు.నాచారంలో ఉంటున్న మేనమామ ఇంటికి వెళ్ళే సమయంలో కార్తీక్‌తో జ్యోతికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి కూడ దారితీసింది. అయితే తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వారిద్దరూ కలిసి భర్త నాగరాజును హత్య చేశారు.

  మొదటి భర్త అనుమతితో లవర్‌తో వివాహం: పోలీసులకు ఫిర్యాదు, ఏమైందంటే?

  భార్యను హెచ్చరించిన టెక్కీ నాగరాజు

  భార్యను హెచ్చరించిన టెక్కీ నాగరాజు

  కార్తీక్‌తో తన భార్య జ్యోతి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని తెలుసుకొన్న భర్త నాగరాజు భార్యను తీవ్రంగా హెచ్చరించాడు. వివాహం తర్వాత కర్మన్‌ఘాట్‌లో నాగరాజు కాపురం పెట్టాడు. అయితే ఇటీవల కాలంలో కార్తీక్‌ను మరోసారి జ్యోతి కలిసింది. దీంతో వారిద్దరి మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన భర్త నాగరాజు జ్యోతిని తీవ్రంగా హెచ్చరించాడు.అయితే కార్తీక్ తో తన సంబంధం కొనసాగించాలంటే భర్త నాగరాజును హత్య చేయాలని భావించింది. ఇటీవలనే కలుసుకొన్న జ్యోతి, కార్తీక్ ఈ విషయమై ప్లాన్ చేశారు.

  ప్రియుడితో రాసలీలలు, రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొన్న భర్త, ఏమైందంటే?

  ప్లాన్ చేసి చంపేసిన జ్యోతి

  ప్లాన్ చేసి చంపేసిన జ్యోతి

  కొత్త సంవత్సర వేడుకల సమయంలోనే నాగరాజును హత్య చేస్తే పోలీసుల దృష్టిని తప్పించుకోవచ్చని జ్యోతి తన ప్రియుడు కార్తీక్‌కు వివరించింది. డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులు బిజీగా ఉంటారు. ఈ సమయంలో తమ పని తాము చేసుకోవచ్చని ఆమె సూచించింది. కార్తీక్త తన స్నేహితులు దీపక్‌, యాసిన్‌, నరేష్‌లకు చెప్పగా, వారు సహకరిస్తామనడంతో హత్యకు ప్రణాళిక సిద్ధం చేశారు.డిసెంబరు 30న రాత్రి ఇంటికి వచ్చిన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి, మత్తులోకి జారుకోగానే కార్తీక్‌కు ఫోన్‌ చేసింది. అతడు వచ్చాక భర్త ముఖంపై దిండుతో బలంగా ఒత్తేసి చంపేశారు.

  కారులో మృతదేహం తరలింపు

  కారులో మృతదేహం తరలింపు

  నాగరాజును చంపేసిన తర్వాత కార్తీక్ తన మిత్రులకు ఫోన్ చేశారు. కార్తీక్ మిత్రుడు దీపక్‌ మిగతా మిత్రులైన యాసిన్‌, నరేష్‌లు కలిసి కారు తీసుకుని కర్మన్‌ఘాట్‌కు వెళ్లారు. అంతా కలిసి నాగరాజు మృతదేహాన్ని అందులోకి ఎక్కించి చౌటుప్పల్‌ పోలీస్‌ ఠాణా పరిధిలోని నిర్జన ప్రాంతంలో శవాన్ని పారేసి వెళ్లిపోయారు. అయితే నాగరాజు జేబులో ఉన్న చీటి ఆధారంగా పోలీసులు జ్యోతికి ఫోన్ చేశారు. అయితే నాగరాజు మృతదేహన్ని చూసి జ్యోతి అనుమానం రాకుండా కన్నీళ్ళు పెట్టుకొంది.తన భర్త రెండు రోజులుగా అదృశ్యమయ్యాడని జ్యోతి పోలీసుల వద్ద నటించింది.

  కాల్‌డేటా ఆధారంగా

  కాల్‌డేటా ఆధారంగా

  నాగరాజు తల వెనుక గాయాలున్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి కావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. నాగరాజు ఫోన్ కాల్ డేటా ను పరిశీలించారు.అయితే డిసెంబర్ 30వ, తేదిన ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అయితే జ్యోతి ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. డిసెంబర్ 30, 31 తేదిల్లో పోలీసులు ఓ విషయాన్ని గమనించారు. ఒకే నెంబర్ ఎక్కువసార్లు ఫోన్లు వెళ్ళినట్టు గుర్తించారు. ఈ ఫోన్ ‌ను గుర్తించగా కార్తీక్ పోన్ నెంబర్ గా తేలింది.కార్తీక్‌ను విచారిస్తే నాగరాజును హత్య చేసిన విషయాన్ని ఒప్పుకొన్నాడు. అయితే అదే సమయంలో కార్తీక్ స్నేహితుడు నరేష్ కూడ ఆత్మహత్య చేయడం కూడ పోలీసులకు కలిసివచ్చింది. నరేష్ కూడ ఈ విషయాన్ని చెప్పాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In yet another case of planned murder of a husband by the wife, the Hyderabad Police stumbled upon a case where one of the supari gang members revealed a ghastly incident.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి