తెలంగాణకు ఏమీ ఇవ్వని ప్రధాని మోడీ.. దిక్కుమాలిన ఆ పార్టీ అవసరమా?: కేటీఆర్ తీవ్రవ్యాఖ్యలు

హైదరాబాద్: ప్రధాని మోడీ, బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతలో తెలంగాణ లేదని.. అలాంటప్పుడు రాష్ట్ర ప్రజల ప్రాధాన్యతలో మాత్రం ప్రధాని మోడీ, బీజేపీ ఎందుకుండాలని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇచ్చేది లేదని మోడీ ప్రభుత్వం తేల్చి చెప్పిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వం, బీజేపీ నేతలను విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్లు చేశారు.

Gujarat gets Rs 20K cr coach factory, nothing to Telangana from centre: KTR slams BJP leaders

'తెలంగాణకు...
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం - ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం - ప్రధాని
ఐటిఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం - ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం - ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం - ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం - ప్రధాని
ప్రధాని ప్రాధాన్యతల్లో..
అసలు తెలంగాణే లేనప్పుడు
తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి..?
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి.??' అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.

వీటన్నింటికీ రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు బాధ్యత వహించాలని అన్నారు. తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదు కానీ.. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి రూ. 20వేల కోట్లు ఇచ్చారు.
'గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్బాగ్యులను ఎన్నుకున్న ఫలితం' అంటూ తీవ్రంగా స్పందించారు మంత్రి కేటీఆర్.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 20 ఏప్రిల్ 2022న దాహోద్‌లో కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. దాహోద్ యూనిట్ గుజరాత్‌లోని మొదటి, భారతదేశంలో నాల్గవ రైల్వే తయారీ యూనిట్. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టర్మరిక్ బోర్డు మంజూరు చేయబోమని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో స్పష్టం చేసింది.

బీఆర్‌ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత బోర్లకుంట, కవితా మాలోతు, దయాకర్ పసునూరి, గడ్డం రంజిత్ రెడ్డి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు ఎదుర్కొంటున్న అడ్డంకులపై ప్రశ్నలు సంధించారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ మాట్లాడుతూ.. స్పైసెస్ బోర్డ్ యాక్ట్, 1986 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఒక చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తి సంస్థ అయిన పసుపు బోర్డు, కొత్తిమీర, మిరపకాయలతో సహా 52 సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించే బాధ్యతను అప్పగించింది.
అందుకే, దేశంలో పసుపు బోర్డు లేదా మరేదైనా మసాలా-నిర్దిష్ట బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి తెలిపారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో కేంద్రం హామీ ఇచ్చిన విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఆర్సీఎఫ్) గురించి ప్రశ్నించగా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ.. "తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదు" అని తేల్చేశారు."ఇప్పటికే మంజూరైన ఫ్యాక్టరీలు సమీప భవిష్యత్తులో భారతీయ రైల్వే రోలింగ్ స్టాక్‌ల అవసరాన్ని తీర్చడానికి సరిపోతాయి" అని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+