ఎంపీ కవిత సమావేశంలో కలకలం: ఆత్మహత్యకు యత్నించిన గల్ఫ్ బాధితుడు..

Subscribe to Oneindia Telugu

నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పట్టణంలో నిర్వహించిన ఓ సమీక్షా సమావేశంలో కలకలం రేగింది. మంగళవారం సమావేశం జరుగుతున్న సమయంలో ఓ గల్ఫ్ బాధితుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

బాధితుడిని రాజేశ్వర్ అనే వ్యక్తిగా గుర్తించారు. గల్ఫ్ వీసా పేరుతో ఏజెంట్ మోసం చేశాడని విలపిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. రాజేశ్వర్ ఆత్మహత్యయత్నాన్ని స్థానికులు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.

gulf victim suicide attempt in mp kavita meeting

రాజేశ్వర్ సమస్య గురించి తెలుసుకున్న ఎంపీ కవిత తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. అతని స్వస్థలం ముప్కాల్ మండలం కొత్తపల్లిగా గుర్తించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajeshwar, A gulf victim was tried to suicide in MP Kavita review meeting in Nizamabad and is stopped by officials. Kavita promised him to solve his problem.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి