Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రదిగ్భ్రాంతి, మృతుల వివరాలివే!

హైదరాబాద్లో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాద ఘటనలో 17మంది మృత్యువాత పడ్డారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద ఒక భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతో ఈ ఘటన జరిగినట్టుగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు అగ్నికి ఆహుతి కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 14మంది మృత్యువాత పడ్డారు. ఇక ఈ భారీ అగ్నిప్రమాద ఘటనలో గాయపడిన వారికి మలక్పేట యశోదలో, అపోలో, డిఆర్డిఓ ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు.

భారీ అగ్ని ప్రమాదం.. స్పందించిన పీఎం మోదీ, సీఎం రేవంత్
ఈ ప్రమాద ఘటనపై భారతదేశ ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అగ్నిప్రమాద ఘటనపైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

gulzar house fire accident 17 died ap cm chandrababu and deputy cm pawan kalyan shocked

గుల్జార్ హౌస్ ప్రమాదంపై స్పందించిన చంద్రబాబు
ఇదిలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తదితరులు భారీ అగ్నిప్రమాద ఘటనలో చోటు చేసుకున్న విషాదం పైన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గుల్జార్ హౌస్ ప్రమాదం పైన స్పందించారు.

17మంది మృతి తీవ్ర బాధాకరం అన్న చంద్రబాబు
హైదరాబాద్లోని గుల్జార్ హౌస్ వద్ద అత్యంత విషాదకరమైన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అగ్ని ప్రమాద ఘటన పైన స్పందించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటన తన మనసును కలచి వేసిందని ఆయన అన్నారు ఈ ప్రపంచంలో 17 మంది మృతి చెందడం బాధాకరమైన పేర్కొన్న ఆయన బాధ్యత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

మృతుల్లో ఏడుగురు చిన్నారులు, మృతుల వివరాలివే
ఇదిలా ఉంటే అగ్ని ప్రమాదం మృతుల వివరాలలోకి వెళితే, ఏడుగురు చిన్నారులతో పాటు మొత్తం 17మంది ఈ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందినట్లుగా సమాచారం. ఇక మృతుల వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రహ్లాద్ ( 70 సంవత్సరాలు)
మున్ని (70 సంవత్సరాలు)
రాజేందర్ మోదీ (65 సంవత్సరాలు)
సుమిత్ర (60 సంవత్సరాలు)
హమేయ్ (ఏడు సంవత్సరాలు)
అభిషేక్ (31 సంవత్సరాలు)
శీతల్ (35 సంవత్సరాలు)
ప్రియాన్ష్ (నాలుగు సంవత్సరాలు)
ఇరాజ్ (రెండు సంవత్సరాలు)
ఆరూష్ (మూడు సంవత్సరాలు)
రిషబ్ (నాలుగు సంవత్సరాలు)
ప్రధమ్ (ఒకటిన్నర సంవత్సరాలు)
అనుయాన్ (మూడు సంవత్సరాలు)
వర్ష (35 సంవత్సరాలు)
పంకజ్ (36 సంవత్సరాలు)
రజిని (32 సంవత్సరాలు)
ఇడ్డు (నాలుగు సంవత్సరాలు)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+