గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం: 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన రేవంత్ సర్కార్!
తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ లో నేడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్ వద్ద చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం 17 మంది ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఇప్పటికే ఈ దుర్ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో పాటు భారత ప్రధాని మోదీ స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తెలంగాణా ప్రభుత్వం 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
ఇప్పటికే కేంద్రం మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికి 50 వేల రూపాయలు పరిహారం ఇస్తామని ప్రకటించారు. తాజాగా గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతదేహాలను ఉంచిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలోని మార్చురీని సందర్శించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రకటించారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటామని డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క హామీ
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలోని రెండు అంతస్తుల భవనంలో ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది పిల్లలు, ఆరుగురు మహిళలు సహా 17 మంది మరణించారు. ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తక్షణం స్పందించి అందరితో మాట్లాడారన్నారు.
సంఘటనా స్థలాన్ని సందర్శించిన కేంద్రమత్రి కిషన్ రెడ్డి
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 8 మంది మరణించారని పోలీస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేందర్ తెలిపారు.మిగిలిన వారు చికిత్స పొందుతూ గాయాలతో మరణించారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రి జి కిషన్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత ప్రజలకు సహాయం అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.హైదరాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications