Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుస్‌కే మారెంగే అన్నారుగా..! మోడీ ముందు ఒవైసీ సంచలన డిమాండ్

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్థాన్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై తరచుగా చెప్పే మాట 'ఇంట్లోకి దూరి చంపేస్తాం(గుస్కే మారెంగే)' అనే దానికి బదులుగా.. అక్కడికి వెళ్లి(పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్)కి ప్రవేశించి అక్కడే తిష్టవేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ భయానికి ఖాళీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఒవైసీ స్పందించారు. వారు ఖాళీ చేసి వుంటే.. మనం వెళ్లి అక్కడే ఉండాలి. ఈసారి కేంద్రం ఏదైనా చర్య తీసుకుంటే.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(POK)ను స్వాధీనం చేసుకోవాలన్నారు ఒవైసీ. పీవోకేను భారతదేశానికి చెందిందనే పార్లమెంటులో తీర్మానం కూడా ఉందని గుర్తు చేశారు.

Guske Maro We must capture PoK Asaduddin Owaisi to Centre

ఉగ్రవాదం అంతం కావాల్సిందేనంటూ పాకిస్థాన్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయన్నారు. లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు జరిగాయి. నాకు ఒక శర్మజీ తెలుసు. ఆయన ఒక తెలుగు పండితుడు. ఆయన తన కూతురిని ఉగ్రవాద దాడిలో కోల్పోయార. కొన్నిసార్లు ఆయన నన్ను వచ్చి కలుస్తారు. అతను తన కుమార్తెను మిస్ అవుతున్నానని చెబుతారు అని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

ముంబైలో 26/11 సంఘటనలో ఛత్రపతి శివాజీ టెర్నినల్‌లో నిజామాబాద్‌కు చెందిన ఒక వధువు హత్యకు గురైందన్నారు. ఆమె చేతుల గోరింటాకు కూడా అలాగే ఉందని చెప్పారు. పుల్వామా, ఉరి, పఠాన్ కోట్ ియాసి ఇలా ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈసారి ప్రభుత్వం వీటిని ముగించేందుకు పీవోకేను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు.

మరోవైపు, పాకిస్థాన్ అణ్వాయుధ బెదిరింపులపై ఒవైసీ స్పందిస్తూ. పాకిస్థాన్ ఎప్పుడూ అణ్వాయుధ శక్తి గురించి మాట్లాడుతుంది. వారు ఒక దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజలను చంపితే.. ఆ దేశం నిశ్శబ్దంగా కూర్చోదని వారు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ఏదైనా సరే.. మన భూమిపై మన ప్రజలను చంపి, మతం ఆధారంగా వారిని లక్ష్యంగా చేసుకుని చంపుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు. పాక్ ఉగ్రవాద సంస్థ ఐసీస్‌లా మాట్లాడుతోందని ఒవైసీ ధ్వజమెత్తారు.

Take a Poll

భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్ రాజకీయ నేత బిలావల్ భుట్టో భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై ఒవైసీ మండిపడ్డారు. బిలావల్ భుట్టో తల్లి పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోని ఉగ్రవాదులే చంపారని గుర్తు చేశారు. పాక్ భారత్ కంటే ఒక గంట వెనుబడి ఉండటమే కాదు.. అర్థ శతాబ్ధం వెనుకబడి ఉందని ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీవోకోను స్వాధీనం చేసుకుంటేనే ఉగ్రవాదంపై పైచేయిసాధించవచ్చన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+