ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడి భార్య ఆత్మహత్య: కారణమిదేనా?
నల్గొండ: పార్లమెంటు సభ్యుడు, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుత్తా సోదరుడి భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణంతో వారి కుటుంబంల విషాద ఛాయలు అలుముకున్నాయి.
చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన గుత్తా మహేందర్ రెడ్డి భార్య శ్రీలత(45) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అనారోగ్య కారణాల వల్లే ఆమె హత్యకు చేసుకున్నట్లు తెలిసింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా, గుత్తా మహేందర్ రెడ్డి గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications