వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసుల నుంచి బయటపడ్డానికేనా చండీయాగం?: కెసిఆర్‌కు గుత్తా ప్రశ్న

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: సహారా, ఈఎస్‌ఐ కేసుల్లో సిబిఐ దర్యాప్తు మాఫీ కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చండీయాగం చేస్తున్నారని నల్గొండ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్‌ యాగాల పేరిట ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్దఆరోపించారు.

నల్గొండ జిల్లాలో తూములను మూసి వేసి ఖమ్మం జిల్లాకు ఎడమకాల్వ నీటిని తీసుకువెళ్లడం సరికాదన్నారు. అవసరమైతే తూములు ఎత్తాలని రైతులకు ఎంపీ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా చెరువులను నింపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను కలియగం నుంచి ద్వాపర, త్రేతాయగాలుకు తీసుకుని వెళ్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. మొన్నటి దాకా ఉత్సవాలు, పండుగలంటూ ఆర్భాటం చేసి ఇప్పుడేమో చండీయాగం అంటున్నారని ఆయన అన్నారు.

Gutta Sukhender Reddy questions KCR on Chandi Yaga

వ్యక్తిగత ఇష్టాల కోసం కేసిఆర్ కోట్టాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం బాధాకరమని ఆయన అన్నారు. జిల్లా మంచ్రి చెప్పిన నాగార్జున సాగర్ అధికారులు వినడం లేదని అంతా అనుకుంటున్నారని, అలాంటప్పుడు మంత్రి ఎందుకని ఆయన అన్నారు.

కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. కెసిఆర్ ఢిల్లీ పర్యటన కేసుల నుంచి బయపడడానికేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ భవన నిర్మాణంలో అవకతవకలకు పాల్పడినట్లు మీడియాలో వార్తుల వచ్చాయి.

English summary
Congress Nalgonda MP Gutta Sukhender Reddy questioned CM K Chandra Sekhar Rao on Sahara case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X