హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెంట్రుకల స్మగ్లింగ్: హైదరాబాద్ టూ చైనా వయా మిజోరాం; ఈడీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు

|
Google Oneindia TeluguNews

చైనీస్ బెట్టింగ్ మొబైల్ అప్లికేషన్‌లపై జరిపిన సోదాలలో మయన్మార్ ద్వారా చైనాకు అక్రమంగా భారతీయుల తల వెంట్రుకలను స్మగ్లింగ్ చేస్తున్న భారీ రాకెట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది. హైదరాబాద్‌ నుంచి ఐజ్వాల్‌ వరకు స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ విస్తరించి ఉందని పేర్కొంటూ కేంద్ర ఏజెన్సీ ఈ కేసులో దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో 139 బ్యాంకు ఖాతాలను సీజ్ చెయ్యటమే కాకుండా రూ.1.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

బీహార్‌లోని మోతీహరిలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం.. కేసు నమోదుబీహార్‌లోని మోతీహరిలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం.. కేసు నమోదు

 వెంట్రుకల స్మగ్లింగ్ .. మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తున్న ఈడీ

వెంట్రుకల స్మగ్లింగ్ .. మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తున్న ఈడీ

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రకారం, ఫిబ్రవరి 9 మరియు 10 తేదీలలో నిర్వహించిన సోదాలు హైదరాబాద్ నుండి మయన్మార్‌తో సరిహద్దు పట్టణమైన మిజోరంలోని ఛాంఫై వరకు వ్యాపించాయి. ఈ సోదాలు మిజోరం మీదుగా అక్రమ భూ మార్గాల ద్వారా భారతదేశం నుండి మయన్మార్‌కు ముడి మానవ వెంట్రుకలను స్మగ్లింగ్ చేయడంపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా నిర్వహించబడ్డాయి. ఈ విధంగా వచ్చిన నగదులో ఎక్కువ భాగం భారతదేశం అంతటా విస్తరించి ఉన్న సంస్థల నుండి అక్రమంగా రవాణా చేయబడిన జుట్టు ఎగుమతుల కోసం అనధికార మార్గాల ద్వారా చట్టవిరుద్ధమైన పరిహారం చెల్లింపులు చేయడానికి ఉపయోగించబడింది అని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.

మిజోరాంలోని మూడు డొల్ల కంపెనీల ద్వారా వెంట్రుకల వ్యాపారులకు హవాలా సొమ్ము

మిజోరాంలోని మూడు డొల్ల కంపెనీల ద్వారా వెంట్రుకల వ్యాపారులకు హవాలా సొమ్ము

మిజోరం లోని మూడు డొల్ల కంపెనీల ద్వారా హవాలా సొమ్ము వెంట్రుకల వ్యాపారులకు చేరుతోందని విచారణలో తేలింది .ఆన్‌లైన్ చైనీస్ బెట్టింగ్ మొబైల్ అప్లికేషన్‌ల ఫండ్ ట్రయల్ ఇన్వెస్టిగేషన్‌లో స్థానిక జుట్టు వ్యాపారులకు పెద్ద మొత్తంలో హవాలా చెల్లింపులు జరిగాయని గుర్తించిన తర్వాత ఏజెన్సీ మనీ-లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.

హైదరాబాద్ నైలా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదు

హైదరాబాద్ నైలా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదు

ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు ఆధారంగా, సిసిఎస్ హైదరాబాద్ పోలీసులు IPC చట్టం, 1860లోని వివిధ సెక్షన్ల కింద తాజా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో నైలా ఫ్యామిలీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డైరెక్టర్ ఎండి ఇబ్రహీం పటేల్) మానవ వెంట్రుకలను ఎగుమతి చేశారని ఆరోపించారు. పలు స్థానిక డొల్ల కంపెనీల పేరుతో బినామీ దిగుమతి ఎగుమతి కోడ్ (IEC)ని ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి కూడా జుట్టు స్మగ్లింగ్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి కూడా జుట్టు స్మగ్లింగ్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి గౌహతి మరియు కోల్‌కతా వరకు ముడి మానవ వెంట్రుకల దేశీయ విక్రయాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ దేశీయంగా విక్రయించబడిన జుట్టు అంతా చివరికి మయన్మార్ ద్వారా చైనాకు చేరుకుంది . మిజోరాంలోని షెల్ బ్యాంక్ ఖాతాల నుండి అమ్మకం ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫండ్ ట్రయల్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించింది .మిజోరాంలో ఉన్న ... షెల్ ఎంటిటీలపై వందల కోట్ల నగదు డిపాజిట్లను తీసుకుంటోందని, డిపాజిట్ చేసిన మొత్తాన్ని భారతదేశం అంతటా విస్తరించి ఉన్న అనేక వెంట్రుక వ్యాపారులకు పంపిందని ఈడీ ప్రకటన తెలిపింది.

 షెల్ కంపెనీలను గుర్తించిన ఈడీ, నిందితుల కోసం గాలింపు

షెల్ కంపెనీలను గుర్తించిన ఈడీ, నిందితుల కోసం గాలింపు

ఈ సంస్థలను సెయింట్ మేరీస్ జెమ్ ఇండస్ట్రీస్ చంపై, సన్ మూన్ హ్యూమన్ హెయిర్ చంపై మరియు థారీ ఎంటర్‌ప్రైజెస్ ఐజ్వాలాండ్‌గా ఈడీ గుర్తించింది. ఈడీ ప్రకారం, లూకాస్ తంగ్మాంగ్లియానా (ఛంఫై జిల్లా నివాసి) ఈ భారీ హవాలా ఆపరేషన్‌కు ప్రధాన సహాయకుడుగా గుర్తించింది. దేశంలోని వెంట్రుకల వ్యాపారులకు చైనాకు మధ్య లూకాస్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు ఈడీ పేర్కొంది.

English summary
The Enforcement Directorate (ED) has busted a huge racket smuggling Indian hair to China. Hair smuggling from Hyderabad to China via Mizoram has been identified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X