వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యూట్యూబ్‌లో చూస్తూ సర్జరీలు,అబార్షన్లు.. ప్రజల ప్రాణాలతో నకిలీ డాక్టర్ చెలగాటం... అరెస్ట్ చేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

వరంగల్‌లో ఓ నకిలీ డాక్టర్ గుట్టు రట్టయింది. యూట్యూబ్‌లో చూసి సర్జరీలు చేస్తున్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను నిర్వహిస్తున్న ఆస్పత్రిని సీజ్ చేశారు. చదివింది బీఎస్సీ అయినా... ఎంబీబీఎస్ బోర్డు పెట్టుకుని అతను డాక్టర్ అవతారమెత్తాడు. వచ్చీ రాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అతనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆస్పత్రిపై దాడి చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే... హన్మకొండలోని బాలసముద్రంలో ఉన్న ఏకశిలా పార్క్‌ ఎదురుగా 'సిటీ హాస్పిటల్' ఉంది. ఇంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నాడు. అయితే అతను చేసే వైద్యంపై చాలామంది చాలాకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇంద్రారెడ్డి చదివింది బీఎస్సీ అని.. అతను మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశాడని చెప్తున్నారు. ఉన్నట్టుండి ఎంబీబీఎస్ అవతారమెత్తి ఆస్పత్రి పెట్టాడని అంటున్నారు.

hanamkonda police arrested a fake doctor performing surgeries

యూట్యూబ్‌లో చూస్తూ అతను ఆపరేషన్లు చేస్తున్నట్లు కొంతమంది జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రెవెన్యూ అధికారులతో కలిసి గురువారం(మార్చి 25) పోలీసులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ మహిళకు ఇంద్రారెడ్డి అబార్షన్ చేస్తున్నాడు. పోలీసులను చూడగానే అక్కడి సిబ్బంది గోడ దూకి పారిపోయారు.

ఆపరేషన్ థియేటర్‌లో ఉన్న బాత్రూమ్‌లో మహిళా పేషెంట్‌ను దాచగా... ఆమె బయటకు తీసుకొచ్చారు. రక్తస్రావం అవుతుండటంతో మెరుగైన వైద్యం కోసం హన్మకొండ జీహెంహెచ్‌కు తరలించారు. ఇంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేశారు. జిల్లా వైద్యాధికారులు ఆ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇంద్రారెడ్డి గతంలోనూ నర్సంపేటలో ఆస్పత్రి ఏర్పాటు చేసి వచ్చీ రాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లు చెప్తున్నారు.

కాగా,గతంలోనూ ఇలాంటి ఫేక్ డాక్టర్ల వ్యవహారం బయటపడ్డ సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లోనూ ఓ ఫేక్ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య విద్య చదకుండానే సాయి క్లినిక్ అనే ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

English summary
Hanamkonda police have arrested a fraud who was allegedly performing surgeries since last few years with a fake MBBS degree. Indrareddy who worked as a medical representative in the past started a clinic in Hanamkonda and performing abortions and surgeries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X