వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రశ్నిస్తున్న విద్యార్థుకు బేడీలు వేస్తున్నారన్న బీజేపి..!కేసీఆర్, కేటీఆర్ మౌనం వీడాలన్న కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. సమస్యకు పరిష్కారం చూపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, గులాబీ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మౌనంగా ఉండడాన్ని పలు రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. అంతే కాకుండా ఇంటర్ విద్యార్థి లోకానికి జరిగిన అవినీతిని ప్రశ్రిస్తున్న విద్యార్థులకు బేడీలు వేస్తూ ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది. మొత్తానికి ఇంటర్ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కొంపముంచేట్టుగా పరిణమిస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం అవుతున్నాయి.

గవర్నర్ కి రేవంత్ రెడ్డి లేఖ..! బోర్డ్ లోపాలను ఎత్తి చూపిన వర్కింగ్ ప్రసిడెంట్..!!

గవర్నర్ కి రేవంత్ రెడ్డి లేఖ..! బోర్డ్ లోపాలను ఎత్తి చూపిన వర్కింగ్ ప్రసిడెంట్..!!

ఇంకా విద్యార్థులు చనిపోవాలని ప్రభుత్వ ఉద్దేశ్యమా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే అంశాన్న ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి గవర్నర్ నరసింహన్ కి ఓ సుధీర్గమైన లేఖ రాసారు. ఇంటర్ బోర్డ్ లో జరిగిన లోపం, అదికారుల అలసత్వంపై ఆయన లేఖలో వివరించారు. విద్యార్థుల భవిశ్యత్ కాపాడాలంటే గవవర్నర్ తక్షణం జోక్యం చేసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ప్రగతి భవన్ లో విద్యార్థుల తల్లిదండ్రులతో చంద్రశేఖర్ రావు ఎందుకు చర్చలు జరపడం లేదని ఇయర ప్రశ్నించారు.

ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్ కు ఏమైందన్న కాంగ్రెస్..! విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..!!

ట్విట్టర్ లో స్పందించే కేటీఆర్ కు ఏమైందన్న కాంగ్రెస్..! విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..!!

ఇంటర్ మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు అన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనని, ప్రభుత్వం పైన 302 కేసు పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ బావమరిది సంస్థ అని తెలిసే కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. ప్రతి అంశంలో ట్విట్టర్ లొ స్పందించే కేటీఆర్ విద్యార్థుల అంశంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. గాంధీ భవన్ లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎందుకు ఇంత వరకు స్పందించలేదని మండిపడ్డారు.

అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలి..! గందరగోళానికి స్వస్తిపలకాలన్న కాంగ్రెస్..!!

అన్ని ఖర్చులు ప్రభుత్వమే భరించాలి..! గందరగోళానికి స్వస్తిపలకాలన్న కాంగ్రెస్..!!

తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులు, యువత మరణిస్తే చంద్రశేఖర్ రావు సంతోష పడ్డారని ఘాటుగా విమర్శించారు. రీ వాల్యుయేషన్ కు విద్యార్థులు ఎందుకు ఫీజులు కట్టాలని, ప్రభుత్వమే రీవాల్యుయేషన్ ఫీజు భరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తప్పు చేసింది ఇంటర్ బోర్డు అని, పాస్ అయిన వాళ్లను ఫెయిల్ చేశారని,ఫెయిల్ అయిన వారిని పాస్ చేశారని, అందుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికి వచ్చిన వారిని దారుణంగా అరెస్ట్ చేస్తున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది.

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీజేపి..! విద్యార్థులకు బేడీలు వేస్తారా అని ఆగ్రహం..!!

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బీజేపి..! విద్యార్థులకు బేడీలు వేస్తారా అని ఆగ్రహం..!!

తెలంగాణ లో ఇంటర్ విద్యార్థులు పిట్టల్లా రాలిపోతే కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. నారాయణ, చైతన్య సంస్థల ప్రమేయం ఉన్నా... అక్కడ మంత్రులుగా ఉన్నారని.. తెలంగాణ సర్కార్ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులకు మర్యాద ఇచ్చే తెలంగాణ సర్కార్.. విద్యార్థులను మాత్రం బేడీలు వేసి తీసుకెళ్తున్నారన్నారని ఘాటుగా విమర్శించారు.

English summary
In Telangana the inter-issue is getting darker. The Chief Minister Chandrashekhar Rao, who has to address the issue,became silence and has been criticized by many political parties. Also, the Bharatiya Janata Party (BJP) has criticised the government for arrest of the students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X