పదేళ్ల బాలుడికి పోలీస్ సంకెళ్లు, పెళ్లి పేరుతో అమ్మాయిలకు లక్షల టోకరా, అరెస్ట్
మెదక్: తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. చోరీ కేసులో పదేళ్ల బాలుడికి మెదక్ జిల్లా పోలీసులు సంకెళ్లు వేశారు. మెదక్ పోలీసుల దారుణం పైన మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఓ చోరీ కేసులో పదేళ్ల బాలుడికి పోలీసులు సంకెళ్లు వేశారు. కోర్టు నుంచి సంకెళ్లతోనే తీసుకు వచ్చి బాలుడిని బస్సులో తరలించారు. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలిసీ తెలియని వయస్సులో చేసిన తప్పుకు ఇలా తీసుకెళ్లడం ఏమిటంటున్నారు.
బాలుడికి సంకెళ్లు వేయడంపై సుమోటో కేసు
చోరీ కేసులో పదేళ్ల బాలుడికి పోలీసులు సంకెళ్లు వేయడంపై జిల్లా కోర్టు సంస్థ తీవ్రంగా స్పందించింది. పూర్తి వివరాలు సేకరించి సుమోటోగా కేసు నమోదు చేస్తామని వెల్లడించింది.

అమ్మాయిల వివరాలు ఆన్‌లైన్లో సేకరించి...
పెళ్లిళ్ల పేరుతో అమ్మాయిలకు టోకరా వేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మ్యాట్రీమోనియల్ పేరుతో వారు అమ్మాయిలకు వల వేస్తున్నారు.
అరెస్టైన వారిలో ఇద్దరు నైజీరియన్లు ఉన్నారు. వీరిద్దరు.. హైదరాబాదుకు చెందిన ఇద్దరితో కలిసి అమ్మాయిలను దోచుకుంటున్నారు. ఆన్ లైన్ ద్వారా అమ్మాయిల వివరాలు సేకరించి వారిని దోచుకుంటున్నారు. నిందితుల్లో హైదరాబాదుకు చెందిన సంతోష్, వీరేందర్ ఉన్నారు.
డాక్టర్లు, సాఫ్టువేర్ ఇంజనీర్ల ఫోటోలను మ్యాట్రీమోనియల్లో పెడుతున్నారు. వారితో సంబంధం కలుపుతామని అమ్మాయిలకు నమ్మబలుకుతున్నారు. వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇటీవల మోసపోయిన పలువురు అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications