Mirchi: సిరులు కురిపిస్తున్న మిర్చి.. క్వింటాకు రూ.90,000 పలికిన ధర..

మిర్చి రైతులపై కనకవర్షం కురుపిస్తోంది. ధరలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఎర్ర బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో దేశీ మిర్చి ధర ఏకంగా రూ. 90 వేలకు చేరుంది. మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.

హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పల్లికి చెందిన అశోక్ అనే రైతు.. తాను పండించిన మిర్చిన మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఈ మిర్చిని మాధవి ట్రేడర్స్కు విక్రయించగా...లక్ష్మీ సాయి ట్రేడర్స్‌ క్వింటాల్‌కు రూ.90 వేలు చెల్లించి కొన్నది. అయితే ఆశోక్‌ తీసుకొచ్చిన మిర్చిలో ఒక్క బస్తాకు మాత్రమే రూ. 90 వేలు పలికింది.

 Hanumakonda fetched Rs.90,000 per quintal for desi Mirchi in Enumamula market.

మిగతా బస్తాలకు మాత్రం సాధారణ ధరలే చెల్లించారు. క్వింటాల్ మిర్చికి రూ. 90 వేలు పలకడంపై రైతు ఆశోక్ సంతోషంతో ఆనందం వ్యక్తం చేశాడు. జులైలో వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వండర్ హాట్ రకం మిర్చికి.. క్వింటాల్‌కు రూ. 32,500 ధర పలికిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో అత్యధికంగా రూ.35,500 పలికింది. తాజాగా ఈ రికార్డు బద్దలైంది.

మిర్చికి రికార్డు ధర పలకడంతో..అన్నదాతలు మార్కెట్కు క్యూ మిర్చి అమ్మడానికి తరలొస్తున్నారు.
అయితే ఈసారి మిర్చి పంట వర్షాలకు దెబ్బతింది. ఉన్న మిర్చి పంటకు తెగుళ్ల సొకాయి. దీంతో దిగుబడి తగ్గి మిర్చికి డిమాండ్ పెరిగింది. మిర్చి రేటు భారీగా పెరగడంతో కరంపొడికి భారీ ధర పెరిగింది. దీంతో సామాన్యులు కరంపొడి కొనాలంటేనే భయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+