'నాడు నిద్రపోలేదు, తెలంగాణ పదేళ్లు ఆలస్యంగా వస్తే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ప్రకటన వచ్చిన రోజు రాత్రి తాను నిద్రపోలేదని, పదేళ్లు ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఫర్వాలేదు అనుకున్నామనని ఆచార్య హరగోపాల్ ఆదివారం అన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేటలో తెలంగాణ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ఘర్షణ పరిపక్వం కాకుండా తాత్కాలిక లక్ష్యం నెరవేరితో ఆశయాలు సాధించలేమని ఆయన చెప్పారు. ఈ రోజు హైదరాబాదులో ఓ కార్యక్రమానికి వెళ్తే... యువత తమ వద్దకు వచ్చి ఉద్యోగాలు వస్తాయా.. రావా.. సార్ అని ప్రశ్నల వర్షం కురిపించారన్నారు.

ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని తాను ఏనాడో ఊహించానని హరగోపాల్ చెప్పారు. పదేళ్లు ఆలస్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంటే ఉద్యమం మరింత రాటుదేలేదని, రాజకీయం మరింత పరిణిచి చెందేదని ఆచార్య హరగోపాల్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications