విద్యార్థినితో అసభ్యంగా: ప్రొఫెసర్‌కు రిమాండ్
హైదరాబాద్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ పైన నార్సింగ్ పోలీసులు నిర్భయ చట్ట కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గండిపేటలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాక్టికల్స్ బోధించే అసోసియేట్ ప్రొఫెసర్ శుక్రవారం విద్యార్థిని చేయిపట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీనిపై ఆగ్రహించిన విద్యార్థినిలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని బంధువులు, కాంగ్రెస్ నాయకులు కొందరు కళాశాల భవనం ముందు ధర్నాకు దిగారు. కళాశాలకు చెందిన కొందరు విద్యార్థినిలు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ విచారణ జరిపి శనివారం ప్రొఫెసర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రొఫెసర్‌ను కళాశాల నుంచి సస్పెండ్ చేశామని ప్రిన్సిపల్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశామని, కళాశాలలోని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ వారు విచారణ జరుపుతారని, వారిచ్చే నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.హైడ్రాలిక్ కంపెనీలో సిలిండర్ పేలుడు
కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్ పారిశ్రామికవాడలోని జీపీఎస్ హైడ్రాలిక్ కంపెనీలో శనివారం సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఓ వ్యక్తి కాళ్లు తెగిపడ్డాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ పేలడంతో కంపెనీ పైకప్పు పూర్తిగా ధ్వంసమైంది. కంపెనీ ఎదురుగా ఉన్న భవనం కిటికీ అద్దాలు పగిలిపోయాయి.
సిలిండర్ ముక్క వేగంగా దూసుకుపోయి ఎదురుగా మూసి ఉన్న ఓ దుకాణానికి చెందిన షట్టర్‌కు తగలడంతో రంధ్రం ఏర్పడింది. లోపలి భాగంలోని గోడకు కూడా తగలడంతో అక్కడ కూడా రంధ్రం ఏర్పడింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయాయి. ఇళ్లలోని వారు భయభ్రాంతులకు గురై బయటికి పరుగులు తీశారు.












Click it and Unblock the Notifications