24న హరిహరన్-జాకీర్ హుస్సేన్ ప్రదర్శన(పిక్చర్స్)
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎంతోమంది గజల్ ప్రేమికులు ఉన్నారని ప్రముఖ గాయకుడు హరిహరన్ అన్నారు. విని ఆస్వాదించే వారు మాత్రమే కాదు.. వీటిని రాసే రచయితలు కూడా చాలా మంది హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పారు. జనవరి 24న ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తో కలిసి ‘హాజీర్-2' శీర్షికన మాదాపూర్‌లోని సైబర్ సిటీ కన్వెసన్ సెంటర్‌లో ఓ ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
ఈ విశేషాలను తెలియజేయడానికి బంజారాహిల్స్‌లోని మందిర్ బోటిక్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కళామందిర్ అధినేత కళ్యాణ్ తోపాటు పేజ్-3 ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన శ్రీనివాస్ గునిశెట్టి, హైదరాబాద్‌లో ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన వెంకటరామన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వెంకటరామన్ మాట్లాడుతూ.. నగరంలో హరిహరన్-జాకీర్ హుస్సేన్ కలిసి చేస్తోన్న తొలి ప్రదర్శన అని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరిహరన్
హైదరాబాద్‌లో ఎంతోమంది గజల్ ప్రేమికులు ఉన్నారని ప్రముఖ గాయకుడు హరిహరన్ అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హరిహరన్
విని ఆస్వాదించే వారు మాత్రమే కాదు.. వీటిని రాసే రచయితలు కూడా చాలా మంది హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పారు.

24న ప్రదర్శన
జనవరి 24న ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తో కలిసి ‘హాజీర్-2' శీర్షికన మాదాపూర్‌లోని సైబర్ సిటీ కన్వెసన్ సెంటర్‌లో ఓ ప్రదర్శన ఇవ్వబోతున్నారు.

పోస్టర్ ఆవిష్కరణ
ఈ విశేషాలను తెలియజేయడానికి బంజారాహిల్స్‌లోని మందిర్ బోటిక్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కళామందిర్ అధినేత కళ్యాణ్ తోపాటు పేజ్-3 ఎంటర్‌టైన్‌మెంట్స్‌కి చెందిన శ్రీనివాస్ గునిశెట్టి, హైదరాబాద్‌లో ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన వెంకటరామన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీడియో కన్ఫారెన్స్ ద్వారా హరిహరన్ మాట్లాడారు. 1970 ప్రాంతంలో హైదరాబాద్‌లో తాను తొలిసారిగా గజల్ పాడానని చెప్పారు. ఇటీవలి కాలంలో నెక్లెస్ రోడ్‌లో తానిచ్చిన ప్రదర్శనకి 10వేల మందికిపైగా హాజరయ్యారని, మరోమారు గజల్స్ ద్వారా ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.
హాజీర్-2 ఆల్బమ్ ప్రమోషన్‌లో భాగంగా ఈ కాన్సర్ట్ చేస్తున్నానని చెబుతూ.. 10 నుంచి 12కిపైగా గజల్స్‌ని కాన్సర్ట్‌లో భాగంగా పాడనున్నామని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం, మందిర్, ఈవెంట్స్ నౌ, సైబర్ సిటీ కన్వెన్షన్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications