జగన్‌ను జీవితంలో కలువలేదు: రెడీనా అంటూ చంద్రబాబుకు హరీష్ సవాల్

వరంగల్: "నా జీవితంలో ఏనాడూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలువలేదు. ఒకవేళ జగన్‌ను కలిశానని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం. లేకపోతే నువ్వు సిద్ధమా" అని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు.

ఓటుకు నోటు కేసుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ - హరీశ్‌రావు, జగన్‌మోహన్‌రెడ్డి కలిసే ఫోన్‌ట్యాపింగ్ నడిపారని అన్నారు. అదే మాటలను చంద్రబాబు చెప్పారు. ఆ ఆరోపణలపై మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. దమ్ము, ధైర్యం ఉంటే ఆధారాలతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

Harish Rao

చీకటి ఒప్పందాలు, చీకటి స్నేహాలు చేసుకోవాల్సిన అవసరమూ అగత్యం తనకు లేదని, ఆ చరిత్ర చంద్రబాబుకే ఉందని అన్నారు. ఓటుకు నోటు కేసులో పీకలదాకా కూరుకుపోయి న చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

మంగళవారం వరంగల్ పర్యటన ముగించుకొని వెళ్తూ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు నానా తంటాలు పడుతున్నారని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+