Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అప్పుడలా.. ఇప్పుడిలా!: రేవంత్ సర్కారుపై నిప్పులు చెరిగిన హరీశ్ రావు

సన్న వడ్లకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 500 బోనస్ ప్రకటించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ బోనస్‌ పెద్ద బోగస్‌ అని.. సర్కారు మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, తాము ఆ మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో పచ్చి అబద్ధాలాడి రైతులను మోసం చేసిందని విమర్శించారు.

రైతులు పండించిన వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిందని.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తుండగా.. వారందరి ఆశలు అడియాసలు చేసిందని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు.

harish rao fires at congress govt over rs 500 bonus for thin paddy

అంతేగాక, కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని.. అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని మంత్రులు ప్రకటించడం అత్యంత బాధాకరమని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 90 శాతం రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారని.. పది శాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. సన్న వడ్లకు మద్దతు ధరకంటే చాలా అధికంగా మార్కెట్‌లో ధర వస్తుందని తెలిపారు.

కానీ, దొడ్డు రకం బియ్యానికే గిట్టుబాటు ధర రాదన్నారు హరీశ్ రావు. అందుకే.. బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకేనని స్పష్టం చేశారు. అలా కాకుండా కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం.. అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమేనని కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు. తాజాగా మంత్రులు చేసిన ప్రకటనతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమంపై, వ్యవసాయాభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమైపోయిందని హరీశ్ రావు విమర్శించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ఇచ్చినవే తప్ప రైతుల మేలు కోసం చేసే కార్యక్రమాలు కావని తేలిపోయిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఎకరానికి రూ.15వేల రైతు భరోసా సాయం ఇస్తామని, వ్యవసాయ కూలీలకు రూ.12వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామనే హామీలను కూడా ప్రభుత్వం ఇప్పటి దాకా అమలు చేయని విషయాన్ని ఈ సందర్భంగా మాజీ మంత్రి గుర్తు చేశారు.

రూ.2లక్షల రుణమాఫీ గురించి కూడా వాయిదాలు పెట్టడమే తప్ప నేటి వరకు అమలు చేసింది లేదని విమర్శించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+