Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ రెడ్డికి శాలువా కప్పి అభినందిస్తానంటూ హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణను తెచ్చింది సిద్దిపేటనేనని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ ​రావు కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ లేదన్నారు. గురువారం సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చేసిన సవాల్‌​ను మళ్లీ స్వీకరిస్తున్నానని హరీశ్ రావు పునరుద్గాటించారు. శుక్రవారం సిద్దిపేటలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు.

పంద్రాగస్టు వరకు ఆరు గ్యారంటీలు, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని
సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు హరీశ్ రావు. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేస్తే రేవంత్​ రెడ్డిని తానే స్వయంగా సిద్దిపేటకు ఆహ్వానించి, శాలువా కప్పుతానని అభినందిస్తానని అన్నారు. సీఎం నియమించిన ప్రెస్​ అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్​ రెడ్డి వద్ద ఇద్దరం రాజీనామా లేఖలు ఉంచుదామన్నారు.

Harish Rao hits out at revanth reddy for fake promises

రేవంత్​ రెడ్డి రాజీనామా లేఖ ప్రెస్​ అకాడమీ ఛైర్మన్‌​కు ఇచ్చిన 10 నిమిషాల్లోనే తన లేఖను పంపిస్తానని హరీశ్​ రావు స్పష్టం చేశారు. స్పీకర్​ ఫార్మెట్​‌లో రాజీనామా లేఖ అందజేస్తానని తెలిపారు. పంద్రాగస్టు వరకు ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా ఆమోదం చేయించుకుంటానని హరీశ్ ​రావు స్పష్టం చేశారు. ఈ ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు.

కాంగ్రెస్​ బాండ్​ పేపర్​ బౌన్స్​ అయిందని, హామీలు, రుణమాఫీ అమలు చేస్తే రాజీనామా చేస్తానన్నారు. సిద్దిపేటకు ఏం చేయలేదో చెప్పండని హరీశ్​ రావు సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు. సిద్దిపేటకు రైలు, గోదావరి నీళ్లు, పోలీస్​ కమిషనరేట్​, మెడికల్​, ఫార్మసీ కాలేజ్​ లాంటి ఎన్నో విద్యాలయాలను బీఆర్​ఎస్​ తెచ్చిందని వివరించారు. సిద్దిపేట అభివృద్ధి కాలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబితే జనాలు నమ్మరని అన్నారు.

సిద్దిపేట ప్రజల చైతన్యమే తెలంగాణ పార్టీని పుట్టించిందన్నారు. సిద్దిపేట లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, ఆ ఉద్యమమే లేకుంటే ఈనాడు తెలంగాణ లేదన్నారు. తెలంగాణ లేకపోతే రేవంత్​ రెడ్డి సీఎం అయ్యేవారు కాదని హరీశ్ రావు విమర్శించారు.ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతే కొడంగల్​ చౌరస్తాలో రేవంత్​ రెడ్డి ముక్కు నేలకు రాస్తారా అంటూ హరీశ్​ రావు
సవాల్ విసిరారు. పార్లమెంట్​ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శలు చేశారు.

రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి.. లేని అప్పులు, అంకెల గారడీ చూపిస్తూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. పెట్టుబడిదారుల్లో అనుమానం రేకెత్తించే విధంగా రేవంత్​ రెడ్డి మాటలు ఉన్నాయని, దీని వల్ల తెలంగాణ నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకుండా కొత్త నాటకాలు తెరతీస్తున్నారని రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు మండిపడ్డారు. సిద్దపేట ప్రజలు కాంగ్రెస్ నేతల నమ్మరని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+