అపెక్స్ భేటీలోనే చిర్రెత్తుకొచ్చి బాబుపై హరీష్ ఆగ్రహం, శాంతింప చేసిన కేసీఆర్

న్యూఢిల్లీ: అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీంఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే.

ఈ సమయంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు కొంత కటువుగా మాట్లాడినట్టుగా తెలుస్తోందిత. స్నేహపూర్వక చర్చలతో సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు వ్యాఖ్యానించగా, హరీశ్ రావు మండిపడ్డారని సమాచారం.

ఓ వైపు ప్రాజెక్టులకు అడ్డుపుల్లలు వేస్తూ, మరోవైపు స్నేహమని మాట్లాడతారా? అని హరీష్ రావు నిలదీశారని తెలుస్తోంది. పులిచింతల ప్రాజెక్టుకు తెలంగాణ పూర్తి సహాయ సహకారాలు అందించిందని, నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు తాము సహకరించామని గుర్తు చేశారు.

వాదన ఏదైనా..: బాబు-కేసీఆర్‌ల ఆత్మీయ పలకరింపు, ఆసక్తిగా చూశారునాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీరు అడుగుతున్న ఏపీకి, శ్రీశైలం నుంచి మాత్రం నీరివ్వడానికి మనసు రావడం లేదని వ్యాఖ్యానించారని సమాచారం. ఈ దశలో వాగ్వాదం పెరుగుతుండటంతో కేసీఆర్ కల్పించుకుని రెండు రాష్ట్రాలూ పరస్పరం ఇచ్చి పుచ్చుకుంటే ఎలాంటి సమస్యా ఉండదని చెప్పి, వాతావరణాన్ని తేలిక చేశారని అంటున్నారు.

ఓ రకంగా అపెక్స్ కమిటీ భేటీలో చంద్రబాబు పైన హరీష్ రావు తీవ్రంగానే నిప్పులు చెరిగారని అంటున్నారు. సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... పొరుగు రాష్ర్టాలతో తమ ప్రభుత్వం స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ సాగు, తాగునీటి వివాదాలను, సమస్యలను పరిష్కరించుకుంటున్నదని, కానీ ఏపీతో మాత్రం అది సాధ్యం కావడంలేదని చెప్పారు.

Harish Rao lashes out at Chandrababu in Apex Council

ఆ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని స్నేహపూర్వకంగా మెదిలితే సమస్యలు పరిష్కారంకాకుండా పోవన్నారు. దీంతో హరీష్ రావుకు చిర్రెత్తుకొచ్చిందని సమాచారం.

పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులపై ఎందుకు ఫిర్యాదు చేశారని, సుప్రీం కోర్టు వరకూ ఎందుకు తీసుకెళ్లారని అడిగారని తెలుస్తోంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఆ ప్రాజెక్టులను ఆపాలని కేంద్రాన్ని ఎలా కోరుతారని నిలదీశారని తెలుస్తోంది.

తమ నల్గొండ జిల్లాకు ఇబ్బంది అవుతున్నా పులిచింతల ప్రాజెక్టులో నీళ్ళు నింపుకోడానికి ఏపీకి పూర్తిగా సహకరించామని, మా పంటలు ఎండిపోతున్నాయని ఏపీ అంటే నాగార్జునసాగర్ నుంచి నీళ్ళు వదిలామని, కృష్ణా జిల్లా నందిగామ ప్రజలకు తాగునీటిని విడుదల చేయించామన్నారు.

కానీ ఇదే స్నేహపూర్వక ఆచరణ ఏపీ నుంచి తమకు లభించడంలేదన్నారు. రాజోలిబండ విషయంలో కర్ణాటక నుంచి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఆ వివాదంతో సంబంధమే లేని ఏపీ అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. హరీశ్, చంద్రబాబు మధ్య వాదన తీవ్రస్థాయికి చేరుకోవడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని శాంతింపజేశారు.

ముమ్మాటికి పాతవే

పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ముమ్మాటికీ పాతవేనని, ఇవి కొత్తవని ఏపీ చేస్తున్న వాదన అర్థ్ధరహితం మాత్రమే కాక పచ్చి అబద్ధం అని అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి,క కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నప్పుడే ఈ రెండు ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులు లభించాయన్నారు.

అపెక్స్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీంఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లు అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరైన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+