కెసిఆర్‌కు ఎవరూ సాటిలేరు: హరీష్, మెడీ మెడలు వంచుతాం: వినోద్
వరంగల్: వరంగల్ నగరాన్ని హైదరాబాదు స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శుక్రవారం అన్నారు. ఆయన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హరీష్ రావు డాక్టర్లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. మూడేళ్లలో తాగు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. పథకాల అమలులో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటిరారు అని చెప్పారు. అధికారుల కొరత ఉన్నా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు.
హైదరాబాద్ తర్వాత వరంగల్‌ను అన్ని హంగుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. పత్తి రైతులను మభ్యపెట్టి చేతికొచ్చిన పంటను తగులబెట్టేలా కాంగ్రెస్ నేతలు దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతల దిగజారుడు రాజకీయాలు చూసి ప్రజలు ఛీకొడుతున్నారన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు చేస్తూ ప్రజలను విస్మరిస్తున్నారని, ఆయన మెడలు వంచుతామని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. వర్ధన్నపేట మండలం సింగారంలో ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పత్తికి గిట్టుబాటు ధర సాధించే వరకు టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు.
ప్రపంచ మార్కెట్లు పత్తి కొనుగోలు చేసేలా మోడీ ప్రయత్నం చేయాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. రైతులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కొంతమంది రైతులను రెచ్చగొట్టి పత్తి పంటను దగ్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూడటం సరికాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాయలో ఎవరూ పడొద్దు సూచించారు.












Click it and Unblock the Notifications