బీజేపీని లాగిన హరీష్, రేవంత్‌పై బాబు సారీ చెప్తారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు భారతీయ జనతా పార్టీని కూడా నిలదీస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ పాలన అందిస్తానని చెబుతున్నారని, కానీ తెలంగాణ బీజేపీ నేతలు అవినీతి మకిలి టీడీపీకి ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, టీడీపీ - బీజేపీలు సార్వత్రిక ఎన్నికల సమయం నుండి కలిసి పని చేస్తున్నాయి.

సోమవారం నాడు హరీష్ రావు మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకే టీడీపీ పుట్టందని వారు చెప్పుకుంటారని, ఇప్పుడు వారు తెలుగవాళ్ల తలదించుకునేలా చేశారన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చేందుకు వచ్చి రేవంత్ ఏసీబీ అడ్డంగా దొరికాడన్నారు.
రేవంత్ ఇష్యూ పైన చంద్రబాబు క్షమాపణలు కోరతారా లేక తప్పు చేసిన వారిని శిక్షిస్తారా అని ప్రశ్నించారు. లేదా వారిని కాపాడుకుంటారా తేల్చుకోవాలన్నారు. చంద్రబాబే స్వయంగా ఎమ్మెల్యేతో మాట్లాడినట్లుగా ఉందని, ఇది కూడా వెలుగులోకి వస్తుందని చెప్పారు.

రేవంత్ పైన చర్యలకు ఆయన ఎందుకు వెనకాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సూత్రధారి చంద్రబాబు అయితే పాత్రధారి రేవంత్ అన్నారు. బాబుకు సీఎంగా, రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉండే అర్హత లేదన్నారు. మొదటి మచ్చ వెన్నుపోటు కాగా, రెండో మచ్చ డబ్బు సంచులు పంపి ఎమ్మెల్యే కొనుగోలు ప్రయత్నం అన్నారు.

టీడీపీ నాయకులు చంద్రబాబును పార్టీ అధ్యక్షుడిగా తప్పించాలన్నారు. ఇటీవలే జాతీయ పార్టీగా తీర్మానం చేసిన టీడీపీ ఏం విలువలు చెప్పదలుచుకుందో చెప్పాలన్నారు. చంద్రబాబు తరఫున వచ్చానని, బాస్ పంపించారని, తేడా వస్తే ఏపీలో నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని రేవంత్ చెప్పారన్నారు. చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.












Click it and Unblock the Notifications