మోడీ రాక: ఏర్పాట్లలో తలమునకలైన హరీశ్ రావు(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'మిషన్ భగీరథ' పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, మిషన్ భగీరథ పథకాన్ని ఆగస్టు 7న ప్రారంభించేందుకు ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన రెండేళ్ల తర్వాత ప్రధానమంత్రి మొదటి సారి వస్తున్నందున ఏర్పాట్లు ఘనంగా చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి గజ్వేల్‌లో మకాం వేసి ఏర్పాట్లు చూస్తున్నారు. వీరు సోమవారం గజ్వేల్‌లో ప్రధాని కార్యక్రమాల ఏర్పాట్లు పరిశీలించారు.

బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. సిద్దిపేట, గజ్వేల్, దొమ్మాట తదితర నియోజక వర్గాల నుంచి పెద్ద సంఖ్యలోజన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మంత్రులు హరీశ్, మహేందర్ రెడ్డి

మంత్రులు హరీశ్, మహేందర్ రెడ్డి

ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ భగీరథ' పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, మిషన్ భగీరథ పథకాన్ని ఆగస్టు 7న ప్రారంభించేందుకు ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన రెండేళ్ల తర్వాత ప్రధానమంత్రి మొదటి సారి వస్తున్నందున ఏర్పాట్లు ఘనంగా చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మంత్రులు హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి గజ్వేల్‌లో మకాం వేసి ఏర్పాట్లు చూస్తున్నారు. వీరు సోమవారం గజ్వేల్‌లో ప్రధాని కార్యక్రమాల ఏర్పాట్లు పరిశీలించారు.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. సిద్దిపేట, గజ్వేల్, దొమ్మాట తదితర నియోజక వర్గాల నుంచి పెద్ద సంఖ్యలోజన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

కాగా, వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి మంచినీటిని ఇవ్వలేకపోతే ఓట్లు కూడా అడగమని ప్రకటించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలసిందే.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

తొలుత 2019 నాటికి మిషన్ భగీరథ పథకం పూర్తవుతుందని అంచనా వేసినా, అంత కన్నా ముందే పథకాన్ని పూర్తి చేసే విధంగా రూపకల్పన చేశారు.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా మిషన్ భగీరథ పనులు సాగుతున్నాయి. 2019 నాటికి పూర్తి అవుతుందనుకున్న ప్రాజెక్టు 2016లోనే గజ్వేల్ నియోజక వర్గంలో పూర్తయింది. గజ్వేల్ నియోజక వర్గంతో పాటు తొమ్మిది నియోజక వర్గాల్లో పనులు పూర్తి ఆయ్యాయి.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం కావడం వల్ల గజ్వేల్‌లోనే మిషన్ భగీరథ ప్రారంభానికి ప్రధానమంత్రిని ఆహ్వానించాలని నిర్ణయించారు. గజ్వేల్‌లో ఇంటింటికి మంచినీటి నల్లాల ఏర్పాటు పూర్తయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు మిషన్ భగీరథపై ఆసక్తి చూపుతున్నాయి.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికి మంచినీటి పథకాన్ని అమలు చేశారు. ఈ విధానాన్ని కూడా తెలంగాణ అధికారులు పరిశీలించారు. ఆయితే తెలంగాణలో మాత్రం దీనికి భిన్నంగా రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఇంటికి మంచినీటి అందించాలని పథకం చేపట్టారు.

మోడీ రాక కోసం ఏర్పాట్లు

మోడీ రాక కోసం ఏర్పాట్లు

ఇప్పటికీ పలు రాష్ట్రాల దృష్టిని ఆకట్టుకున్న ఈ పథకం ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేయించడం ద్వారా జాతీయ స్థాయిలో మరోసారి ఆందరి దృష్టిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Irrigation Minister T Harish Rao on Monday said that the State Government had completed the works of Mission Bhagiratha in record time of six months by spending Rs 1,055 crore.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి