Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ పాలనలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి: భగ్గుమన్న హరీష్ రావు

కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో గ్రామాలు, పట్టణాల్లో పాలన పడకేసిందని, నాడు గ్రామాల అభివృద్ధి ముఖ్యమని కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని, పట్టించుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని మండిపడ్డారు.ఏడునెలల్లో నయా పైసా కూడా పల్లె, పట్టణాలకు విడుదల చేయలేదని, మేము ప్రతీనెలా నిధులు ఇచ్చామన్నారు. బి ఆర్ ఎస్ పాలనలో పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు.

కాంగ్రెస్ పాలనలో పల్లెల్లు అస్తవ్యస్తం
సర్పంచుల కాలం ముగిసింది. జిల్లా పరిషత్ కాలం ముగుస్తున్నది. కానీ ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేదని అసహనం వ్యక్తం చేశారు .కాంగ్రెస్ పాలనలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి. అస్తవ్యస్తం అవుతున్నాయన్నారు. పారిశుధ్య కార్మికులు 7 నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్ బిల్లులు కట్టడం లేదు. ట్రాక్టర్ ఇన్స్టాల్మెంట్ కట్టడం లేదన్నారు.

Harish Rao targets Revanth Reddy govt over villages problems and khammam farmer suicide

ప్రజా పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా?
గ్రామ పాలన అస్తవ్యస్తం అయ్యిందని, ఇదేనా ప్రజా పాలన అంటూ విరుచుకుపడ్డారు. పంచాయతీల్లో డబ్బులు లేక చెత్త ఎక్కడిక్కడ పేరుకు పోయిందని, ప్రజా పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వరా? అంటూ మండిపడ్డారు. చివరకు గవర్నర్ ను కలిసి సర్పంచులు వినతి ఇచ్చే పరిస్థితి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా?
తమ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతి, ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశామని, పల్లె, పట్టణ ప్రగతి కోసం 20 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.తక్షణం పారిశుద్ధ్య కార్మికులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అంటూ ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి రైతు ఆత్మహత్య
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి, గ్రామాలు, పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి, పారిశుద్ద్యం పెంపొందించాలన్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచారని, సంక్షేమానికి సమాధి కట్టారని, ఆంక్షలు తప్ప పింఛన్లు లేవని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక రైతు ప్రభాకర్ ఖమ్మంలో చనిపోయారు. ఎంతో బాధ వేసిందని, ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయో అర్ధం అవుతుందన్నారు.

రైతు ఆత్మహత్యపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించండి
చావుకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి, ప్రభాకర్ కుటుంబానికి 25 లక్షల ఎక్సగ్రేషియా, కుటుబంలో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వాస్తవాలు తెలిసేలా, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+