హరీష్ రావు తన కన్నా సిద్ధిపేటను ఎక్కువగా ప్రేమిస్తారు: హరీష్ రావు సతీమణి

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచార పర్వం కొనసాగుతుంది. అయితే సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన, మంత్రి హరీష్ రావు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు హరీష్ రావు సతీమణి శ్రీనిత రావు.

ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్న ఆమె ప్రజలతో మాట్లాడుతూ హరీష్ రావుకు సిద్దిపేట అంటే తనకంటే, తన ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఇష్టమని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రజల నుంచి తమకు ఎంతో ప్రేమ ఆప్యాయతలు లభించాయని ఆమె పేర్కొన్నారు బతుకమ్మ సిద్దిపేట అభివృద్ధిలో పదిరెట్లు ముందంజలో ఉందని హరీష్ రావు సతీమణి శ్రీనిత రావు వెల్లడించారు.

Harish Raos wife srinitha said Harish Rao loves Siddipet more than her

తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకుందామని, ఎవరో ఇస్తే వచ్చింది కాదని ఆమె పేర్కొన్నారు. హరీష్ రావు అంటే సిద్దిపేట ప్రజలకు అమితమైన ప్రేమ ఉందని, గత ఎన్నికల్లో అది ప్రతి ఒక్కరు స్పష్టం చేశారన్నారు. సిద్దిపేటలో మొత్తం రెండు లక్షల 26 వేల ఓట్లు ఉన్నాయని, 2018ఎన్నికల్లో లక్ష 18వేల మెజార్టీని ఇచ్చిన ప్రజలు ఈసారి ఎన్నికల్లో అంతకుమించి అత్యధికంగా మెజారిటీ ఇచ్చి హరీష్ రావు ని గెలిపించాలని కోరారు.

ఒకపక్క మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల కోసం ప్రచారాన్ని కొనసాగిస్తుంటే, హరీష్ రావు కోసం హరీష్ రావు సతీమణి ఇంటింటికి తిరుగుతూ భర్త కోసం ప్రచారం చేస్తుంది. ఇతరదేశాలకు వెళ్ళినప్పుడు వచ్చిన ఆలోచనలను సిద్ధిపేటలో ప్రతిబింబించేలా చూసే అలవాటు హరీష్ రావుకు ఉందని, అందులో భాగంగా అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు.

కోమటి చెరువులో అభివృద్ధి చేసిన జురాసిక్ పార్క్ యూఎస్ఏ లో తమ కుమారుడిని కలవటానికి సందర్శించినప్పుడు కనిపించిందని అన్నారు. రంగనాయక సాగర్ అతిధి గృహాలను మాల్దీవులలో చూసి అభివృద్ధి చేశారన్నారు. తన భర్త హరీష్ రావును గెలిపించాలని హరీష్ రావు సతీమణి శ్రీనిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+