ముగిసిన ఎన్నికలు: రాజకీయం లేదని అజారుద్దీన్‌పై వివేక్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం నాడు ముగిశాయి. అధ్యక్ష బరిలో జీ వివేక్, విద్యుత్ జయసింహాలు ఉన్నారు.
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం నాడు ముగిశాయి. అధ్యక్ష బరిలో జీ వివేక్, విద్యుత్ జయసింహాలు ఉన్నారు. ఆరు పదవుల కోసం పద్దెనిమిది మంది పోటీ పడ్డారు. 218 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైకోర్టు తీర్పు అనంతరం విజేతను ప్రకటిస్తారు.

హెచ్‌సిఏ ఎన్నికలు ముగిసిన అనంతరం జి వివేక్ విలేకరులతో మాట్లాడారు. ఈ విషయంలో కొందరు తప్పుడు ఆరోపణలు చేశారని వివేక్.. మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ను ఉద్దేశించి అన్నారు. ఆయుబ్ ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.
తాము హైకోర్టు ఆదేశాలను శిరసావహిస్తామని తెలిపారు. ఓడిపోతున్నానని తెలిసి కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హెచ్‍సిఏ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు.












Click it and Unblock the Notifications