ఓటుకు నోటు: జిమ్మి బాబుపై చర్యలకు సిద్ధం
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జిమ్మి బాబు పైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు కుంభకోణంలో జిమ్మిబాబు పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై హెచ్‌సీఏ స్పందించిందని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన జిమ్మి బాబు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కో ఆర్డినేటర్‌గా ఉన్నారు. దీంతో, హెచ్‌సీఏ స్పందించింది. జిమ్మిబాబుపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

కాగా, ఓటుకు నోటు కేసు మరో కొత్త వ్యక్తి పేరు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు కేసులో ఎక్కడా బయటపడని జిమ్మీ అనే వ్యక్తికి ఏసీబీ అధికారులు నోటీసు జారీ చేశారు.
సోమవారం సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సెబాస్టియన్‌ను స్టీఫెన్ సన్ వద్దకు తీసుకొచ్చి, ఆయనను పరిచయం చేసిన వ్యక్తే ఈ జిమ్మీ అని తెలిసింది. ఈ విషయాన్ని స్టీఫెన్ సన్ తన వాంగ్మూలంలో తెలిపారు.












Click it and Unblock the Notifications