కారులోనే కేక్ కట్ చేసి, అంతలోనే: సీటు బెల్ట్ ధరించని అనన్య, ప్రమాదానికి కారణాలివే
Recommended Video

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యూపీకి చెందిన హెచ్‌సీయు విద్యార్థి అనన్య మృతి చెందిన విషయం తెలిసిందే. స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా అనన్య, ఆమె స్నేహితులు జతిన్, నిఖితలు అర్దరాత్రి వరకు రోడ్డుపై కారులో తిరిగారు. ఆ తర్వాత మంగళవారం వేకువజామున భోజనానికి వెళ్లే క్రమంలో అతివేగంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు.
చదవండి: ఔటర్‌లో ఘోర ప్రమాదం, అనన్య మృతి: ఎగిరిపడ్డ కారు, దొరికిన మద్యం బాటిల్
శంషాబాద్ పోలీసులు చెప్పిన ప్రకారం యూపీకి చెందిన, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న అనన్య (21), నేపాల్‌కు చెందిన నిఖిత స్నేహితులు. నిఖిత స్నేహితుడు, గచ్చిబౌలిలో ఉంటూ ట్యాక్స్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న జోద్‌పూర్‌కు చెందిన జతిన్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి ఇద్దరూ గచ్చిబౌలి వెళ్లారు.

కారులోనే కేక్ కట్ చేసి, సంతోషంగా
కారులోనే కేక్ కట్ చేశారు. పార్టీ చేసుకున్నారు. చాలాసేపు కారులో నగరంలో తిరిగారు. ఆ తర్వాత భోజనం చేయడానికి మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఉన్న డాబా వద్దకు వెళ్లాలనుకున్నారు.

చీకట్లో అయోమయానికి గురై
దీంతో నగరం నుంచి అటు వైపు కారును తిప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ దిశగా వెళ్లారు. చీకట్లో అయోమయానికి గురై పెద్ద గోల్కొండ జంక్షన్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కిందకు దిగారు. తర్వాత పీ1 రహదారిపై వస్తుండగా 3.20 గంటల ప్రాంతంలో బూర్జుగడ్డ తండా మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు తిరగబడింది.

సీటు బెల్టు ధరించని అనన్య
అనన్య సీటు బెల్టు ధరించలేదు. ఆమెతో పాటు ముగ్గురూ గాయపడ్డారు. వేకువజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో బాధితులను ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అనన్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మిగిలిన ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన గంట వరకు అనన్య రక్తపు మడుగులోనే కొట్టుమిట్టాడిందని, సకాలంలో చికిత్స అంది ఉంటే ఆమె ప్రాణాలు దక్కేవని స్థానికులు చెబుతున్నారు.

కారు వేగం, మత్తు
ప్రమాదం సమయంలో కారు వేగం దాదాపు 120 కిలో మీటర్లకు పైగా ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. కారులో పగిలిన మద్యం సీసాలు ఉన్నాయి. దీంతో జతిన్ మద్యం తాగి కారు నడిపి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. అతని రక్తనమూనాలను సేకరించారు. మద్యం మత్తు, అతివేగం కారణంగా క్రాస్‌ను గుర్తించకపోవడం వల్ల ప్రమాదానికి గురైనట్లుగా భావిస్తున్నారు.
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications