ఔటర్‌లో ఘోర ప్రమాదం, అనన్య మృతి: ఎగిరిపడ్డ కారు, దొరికిన మద్యం బాటిల్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Hyderabad Outer Ring Road Road Mishap : అనన్య ప్రమాదానికి కారణాలివే !

  హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనన్య మృతి చెందారు. ఈమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బూర్జుగడ్డ పివన్‌ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

  చదవండి: అక్కకు ద్రోహం, బావతో సంబంధం: భర్తను చంపిన శ్రీవిద్య నవ్వుతూ, షాకింగ్ విషయాలు

  హైదరాబాద్‌కు చెందిన అనన్య, నిఖిత, నితిన్‌ ఔటర్ పైన లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లారు. షాద్‌నగర్ సమీపంలోని బూర్జుగడ్డ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించారు.

  చదవండి: జూబ్లీహిల్స్ ప్రమాదంలో జూ.ఆర్టిస్ట్ మృతి: మరో కారు మధ్యలో, అమ్మాయిలు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు?

  అనన్య మృతి

  అనన్య మృతి

  ఆసుపత్రికి తరలించగా అనన్య అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. గాయపడిన వారి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హెచ్‌సీయూలో చదువుతున్న అనన్య స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నితిన్ సాఫ్టువేర్ ఇంజినీర్ అని తెలుస్తోంది. అనన్య సెంట్రల్ వర్సిటీ విద్యార్థిని. ఆమె యూపీ అమ్మాయి.

  నితిన్ పుట్టిన రోజు సందర్భంగా

  నితిన్ పుట్టిన రోజు సందర్భంగా

  నితిన్‌ పుట్టిన రోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన అనంతరం నితిన్‌, అనన్య, మరో మహిళా సాప్ట్‌వేర్‌ ఇంజిజినీర్ నిఖితలు లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లారు. ఔటర్‌లో వీరు లాంగ్‌ డ్రైవ్‌లో ఉండగానే మంగళవారం వేకువజామున రెండు గంటల సమయంలో బూర్జుగడ్డ వద్ద డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో అనన్య అక్కడక్కడే మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

  ప్రమాద ఘటన వద్ద మద్యం బాటిల్

  ప్రమాద ఘటన వద్ద మద్యం బాటిల్

  విషయం తెలిసి శంషాబాద్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కారును పరిశీలించారు. అక్కడ బీరు బాటిల్‌ లభ్యమైంది. దీంతో వారు మద్యం సేవించి వాహనం నడిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న నితిన్‌ స్పృహలోకి వస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని చెబుతున్నారు.

  కారు వేగం

  కారు వేగం

  వీరు హ్యూండాయ్ ఐ20 కారు (టీఎస్ 09 ఈఎస్ 5257)లో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు అమాంతం ఎగిరి పడటంతో వారికి తీవ్రంగా గాయాలై, ఒకరు మృతి చెందారు. మద్యం మత్తులో ఉండటం, కారు వేగంగా వెళ్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Uttar Pradesh student ananya killed in road accident in Hyderabad on Tuesday morning.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి