రోహిత్ ఆత్మహత్య: ఇలాగైతే ఎలా.. పోలీసులపై హైకోర్డు జడ్జి ఆగ్రహం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ వేముల తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ రాసిన లేఖతో పాటు ఈ వ్యవహారానికి సంబంధించిన పత్రాల నకళ్లను సమర్పించిన పోలీసులపై బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు పత్రాలను తమ ముందుంచాలని ఆదేశించింది. రోహిత్ ఆత్మహత్యకు కారణమయ్యారంటూ ప్రశాంత్ అనే విద్యార్థి దాఖలు చేసిన ఫిర్యాదులో తనను నిందితునిగా చేర్చారని, తనపై కేసు కొట్టివేయాలంటూ వీసీ అప్పారావు కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై జస్టిస్ పివి సంజయ్ కుమార్ బుధవారం నాడు విచారణ చేపట్టారు. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం గచ్చిబౌలి పోలీసులు ఈ కేసుకు సంబంధించి నకలు పత్రాలను కోర్టు ముందుంచారు. దీనిపై జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా సమర్పిస్తే విచారణ ఎలా చేపట్టాలన్నారు.
రోహిత్ కులానికి సంబంధించి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నివేదిక సమర్పించినట్లు తెలిసిందని వీసీ తరఫు న్యాయవాది ఎన్వి సుమంత్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు. ఒరిజినల్ పత్రాలను ఆలోగా సమర్పించాలని హోం డిపార్టుమెంటును ఆదేశించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications